అల్లు అరవింద్ అన్నది బాగానే ఉంది.. పాటించాల్సింది ఎవరు?

తెలుగు సినిమా పరిశ్రమతో పాటు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు కష్టాల కడలిని ఈదుతున్నాయి.వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

 Allu Aravind About Tollywood Problem , Allu Aravind , Film News , Movie News-TeluguStop.com

ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్లుగా కరోనా మరియు ఓటీటీ ల ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టబడింది.ఈమద్య కాలంలో సినిమా లకు వసూళ్లు మినిమం గా కూడా రావడం లేదు.

ఒకప్పుడు యావరేజ్ సినిమాలకు బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా సాధ్యం అయ్యేది.కాని ఇప్పుడు అలా జరగడం లేదు.

ఇండస్ట్రీలో ఈ సమస్య పై అల్లు అరవింద్ స్పందించాడు.సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉండటంతో పాటు ఓటీటీ ల్లో విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే విడుదల అవుతున్న కారణంగా జనాలు థియేటర్లకు రావడం లేదు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్ది థియేటర్లు మూత పడే పరిస్థితికి వచ్చాయి.అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో అల్లు అరవింద్ ఒక కార్యక్రమంలో స్పందించాడు.ఓటీటీ లో విడుదల విషయం లో కాస్త సంయమనం పాటించాలి.మినిమం గా ఎనిమిది వారాల నుండి అరవై రోజుల వరకు సినిమా లను ఓటీటీ లో విడుదల చేయవద్దు.అలాగే ఓటీటీ లో విడుదల చేసే విషయం లో ముందస్తుగానే ఒప్పందం చేసుకోకుండా విడుదల అయిన తర్వాతే అన్నట్లుగా ఒప్పందం చేసుకోవాలి.

అలాగే భారీ ఎత్తున పెంచిన టికెట్ల రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.టికెట్ల రేట్లను పెంచడం ఓకే గాని తగ్గించడం కష్టం.

అలాగే సినిమా కు సరైన వసూళ్లు రాకుంటే వెంటనే ఓటీటీ లో విడుదల చేస్తే ఒకింత డబ్బు అయినా వస్తుంది.అందుకే ఓటీటీ లో వెంటనే విడుదల చేయకుండా ఉండదు.

అల్లు అరవింద్‌ చెప్పింది బాగానే ఉన్నా పాటించే వారే లేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube