ఏపీలో కూటమి గెలుపు కష్టమే.. నిరాశలో విపక్ష పార్టీల క్యాడర్..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారట.

ప్రధాన విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ మరో రెండు పార్టీలు బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నప్పటికీ గెలుపు అసాధ్యమని అభిప్రాయపడుతున్నారట.తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి తమ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేయడమే దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు.

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నిక( Assembly election)లు జరగగనున్నాయి.ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి.

ఓ వైపు వైసీపీ, మరోవైపు ఎన్డీయే కూటమి( టీడీపీ - బీజేపీ -జనసేన) అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పార్టీలు.

Advertisement

ప్రజల్లోకి వెళ్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.అయితే తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట కూటమి అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలతో విపక్ష పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.

ఏపీలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.ఎన్డీయే కూటమిలో కలిసిన అంతగా మేలు ఏం జరిగే అవకాశం లేదన్నారు.

దీన్ని బట్టి కూటమి గెలుపు కష్టమని ఆయన ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నారంటూ టాక్ వినిపిస్తోంది.మరోవైపు లావు శ్రీకృష్ణ దేవరాయ( Lavu Sri Krishna Devarayalu )ల కామెంట్స్ టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.

దీంతో పార్టీ క్యాడర్ నిరాశలోకి వెళ్తున్నారని సమాచారం.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..

ఎన్నికల్లో పోటీ చేసే విపక్ష పార్టీ అభ్యర్థులకు కాన్ఫిడెన్స్ లేకపోవడంతో పాటు వారే స్వయంగా గెలవడం కష్టమని చెబుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.దీన్ని బట్టి రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ సర్కార్ రావడం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.దాదాపు ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

Advertisement

ఇందులో భాగంగా ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో తన ప్రభావాన్ని చాటిన వైసీపీ మరోసారి ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది.ఈ యాత్రతో రాష్ట్రంలో ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

జనం, జగన్ కలిస్తే ప్రభంజనమేనని స్పష్టం అయింది.

22 రోజుల పాటు సాగిన సీఎం జగన్ బస్సు యాత్ర( CM Jagan bus trip ) సుమారు 2,100 కిలోమీటర్ల మేర సాగింది.కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా కొనసాగి.శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో భారీ బహిరంగ సభతో ముగిసింది.

ఇందులో భాగంగా సీఎం జగన్ 16 బహిరంగ సభలతో పాటు 9 ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు.అంతేకాదు జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు.

ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా జనం తరలిరావడం విశేషం.తామంతా జగన్ వెంటే ఉన్నామని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ ప్రజలు చెబుతున్నారని తెలుస్తోంది.అత్యధిక లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్ ’ ప్రభంజనం కొనసాగడం తథ్యమని చెప్పడం విశేషం.

ఇదే విషయాన్ని ఇప్పటికే పలు సర్వే సంస్థలు వెల్లడించాయి.నవరత్నాలతో పాటు మ్యానిఫెస్టోను 99 శాతం వైసీపీ సర్కార్ అమలు చేసింది.

విద్యా, వైద్యారోగ్య రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.పేదవారి సొంతింటి కలను సాకారం చేసింది.

కుల, మతాలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని గడప వద్దకే చేర్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన సీఎం జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

తమ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తేనే తనను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. సిద్ధం సభలు విజయవంతం కావడంతో పాటు తాజాగా చేసిన మేమంతా బస్సు యాత్రతో సీఎం జగన్, వైసీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

మరోవైపు టీడీపీ అభ్యర్థులు సైతం విపక్షాల గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని తెలుస్తోంది.

తాజా వార్తలు