అలయన్స్ ఎయిర్ నిర్లక్ష్యం..! శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు..

హైదరాబాదులో అలయన్స్ ఎయిర్ లైన్స్ వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈరోజు ఉదయం 9 గంటలకు శంషాబాద్ నుంచి కొల్హాపూర్ వెళ్లాల్సిన విమానం అందుబాటులోకి రాలేదు.

 Alliance Air Negligence..! Passengers In Shamshabad Airport-TeluguStop.com

విమానం షెడ్యూల్ ని ఇప్పటికి నాలుగు సార్లు అలయన్స్ ఎయిర్ మార్చిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.ఉదయం నుంచి ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు.

ఉదయం నుంచి ఇప్పటివరకు అసలు విమానం ఉందో లేదో అనే సమాచారం కూడా అలయన్స్ ఎయిర్ సిబ్బంది చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో విమానాశ్రయంలోని గేట్ నెంబర్ 10 వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

అలయన్స్ ఎయిర్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, ఇప్పటికైనా స్పందించి సమాధానం చెప్పాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube