మరో మూడు వారాలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన పార్టీలలో అధికార పార్టీ బీఆర్ఎస్ మంచి దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది.
పార్టీల అభ్యర్థుల ప్రకటించడం నుండి ప్రచారం వరకు బీఆర్ఎస్ దూసుకుపోతోంది.మూడోసారి తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి ప్రధాన పార్టీలలో అన్నిటికంటే బీఆర్ఎస్ అన్ని విషయాలలో ముందంజలో ఉంది.
ఇక ఇదే సమయంలో మూడోసారి కచ్చితంగా గెలవాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్( CM KCR ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా అల్లంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం జరిగింది.ఇదివరకు ఇక్కడి నుంచి అబ్రహం( MLA Abraham ) పేరును ప్రకటించారు.
అయితే తాజాగా అబ్రహంను తప్పించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అనుచరుడు విజయుడికి అవకాశం ఇవ్వటం జరిగింది.అబ్రహం అల్లంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.కానీ నియోజకవర్గంలో ఆయనకు మొదట టికెట్ కేటాయించటంపై అసంతృప్తి రాగాలు ఒక్కసారిగా వినిపించడంతో విజయుడికి అవకాశం ఇవ్వటం జరిగింది.ఈ క్రమంలో విజయుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( ktr ) బీఫామ్ ఇవ్వటం జరిగింది.
నామినేషన్ దాఖలుకు మరో మూడు రోజులు సమయం మాత్రమే ఉన్న క్రమంలో బీఆర్ఎ( BRS PARTY )స్ ఈ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.







