Hero Xpulse 200T 4V Bike: హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫీచర్స్‌ ఇవే..!

హీరో కంపెనీ తీసుకొచ్చే బైక్స్‌కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మన భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన బైక్స్‌యే ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి.

 All New Hero Xpulse 200t 4v Bike Features And Price Details, Hero Xpulse 200t 4v-TeluguStop.com

కాగా ఈ కంపెనీ కొంతకాలం క్రితం తీసుకొచ్చిన ఎక్స్‌పల్స్ 200టీ 4వీ బైక్ అనూహ్య రీతిలో అమ్ముడుపోయింది.అయితే ఈ ఏడాదిలోనే ఈ బైక్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ తీసుకురానుంది.

హీరో మోటోకార్ప్ ఇటీవలే అప్‌కమింగ్ ఎక్స్‌పల్స్ 200Tని టీజ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే హీరో కంపెనీ ఎల్ సాల్వడార్‌ ప్రదేశం కోసమే ప్రత్యేకంగా ఓపెన్ చేసిన ఒక వెబ్‌సైట్‌లో న్యూ మోటార్‌సైకిల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

దాంతో ఇండియాలో రానున్న దీని డిజైన్ ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చింది.అయితే ఇండియన్ వెర్షన్‌లో టెక్నాలజీ ఫీచర్లు వేరేలా ఉంటాయని తెలుస్తోంది.కొత్త మోడల్‌లో అత్యంత స్పష్టమైన మార్పు అప్‌డేటెడ్ స్టైలింగ్ అని చెప్పవచ్చు.లీకైన చిత్రం ఇప్పటికే కొత్త మోడల్‌పై ఒక క్లూ అందించింది.

ఈ కొత్త బైక్ లాంగ్ టూర్స్ వెళ్లడానికి, సిటీలో తిరగడానికి, ఫ్యామిలీతో కలిసి రైడ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది.రిట్రో డిజైన్‌తో వచ్చే బైక్ ఈసారి రౌండ్ హెడ్‌లైట్ రీపొజిషన్‌తో విడుదల కానుందని తెలుస్తోంది.

కొత్త గ్రాబ్ రైల్, బెల్లీ పాన్, ఫోర్క్ గేటర్స్, కొత్త పెయింట్ ఆప్షన్లు వంటివి దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.దీని బాడీ-కలర్ ఫ్లై-స్క్రీన్‌తో రీడిజైన్డ్‌ ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది.

Telugu Xpulse, Cycle, Bike, Xpulse Bike-Latest News - Telugu

కొత్త ఎక్స్‌పల్స్ 200T 199.6సీసీ సింగిల్-సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్‌తో రానుందని సమాచారం.ఇదే ఇంజన్‌ను ఎక్స్‌పల్స్ 200 4వీలో కూడా అందించారు.ఎక్స్‌పల్స్ 200టీ 8,500 ఆర్పీఎమ్ వద్ద 18.8 BHP.6,500 ఆర్పీఎమ్ వద్ద 17.35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.ప్రస్తుతం ఎల్ సాల్వడార్‌లో ఈ బైక్‌ను కార్బ్యురేటర్‌తో కూడిన 2-వాల్వ్ ఇంజన్‌తో విక్రయిస్తున్నారు.

ఇండియాలో విక్రయించనున్న ఈ బైక్‌లో 4-వాల్వ్ ఇంజన్‌ను ఆఫర్ చేయనున్నట్లు ఒక నివేదిక పేర్కొంది.అదే జరిగితే దీని పవర్ 19.1PS, టార్క్ 17.35Nmకి పెరుగుతుంది.

ఈ అప్‌కమింగ్ బైక్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, అలాగే బ్రేకింగ్ సెటప్ మారదు.ఎల్ సాల్వడార్‌లో ఈ బైక్ పిరెల్లి ఏంజెల్ టైర్‌లతో వస్తుంది, భారతీయ మోడల్ ఫ్రంట్ సైడ్ MRF నైలోగ్రిప్ జాపర్, బైక్ సైడ్ రెవ్జ్‌ టైర్‌తో లాంచ్ కావచ్చు.

హీరో ఎక్స్‌పల్స్ 200టీ ఈ నెలాఖరున షోరూమ్‌లలోకి వస్తుంది.ప్రస్తుత బైక్ ధర రూ.1,24,396 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉండగా కొత్తది రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ధర పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube