తాజాగా కేరళలోని కన్నూర్ జిల్లాలో ఒక షాకింగ్ చోటు చేసుకుంది.ఈ ఘటనలో తల పొగరుకెక్కిన ఓ వ్యక్తి ఆగివున్న తన కారును తాకాడని ఓ బాలుడిని నిర్దాక్షిణ్యంగా తన్నాడు.6 ఏళ్ల బాలుడు కేవలం కారుకు ఎదురుగా నిలబడి ఉండగా అతడు వచ్చి బూతులు తిడుతూ తన బూటు కాలితో ఒక తన్ను తన్నాడు.గురువారం సాయంత్రం కన్నూర్‌లోని తలస్సేరి టౌన్‌లో ఓ రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది.
బాలుడిని తన్నిన వ్యక్తి మహమ్మద్ షిషాద్‌గా పోలీసులు గుర్తించారు.అతడే ఈ కారుకి యజమాని అని తెలుసుకున్నారు.
నిందితులు బాలుడిని తన్నడంతో అక్కడి ప్రజలు బాలుడిని రక్షించడానికి ముందుకొచ్చారు.“చిన్నపిల్లోడు, తెలియక కారు పట్టుకున్నాడేమో.అందుకని మీరు తన్నుతారా” అని చాలామంది అతడిపై అరిచారు.అయితే బాలుడు కారు డోర్ తెరవడానికి ప్రయత్నించాడని ఆ వ్యక్తి ఆరోపించాడు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ట్రాఫిక్ జంక్షన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.ఈ సీసీటీవీ ఫుటేజీలో బాలుడు డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు.
సో, బాలుడు కారుకు ఆనుకుని ఉన్నందుకే అతడు తన్నినట్లు తెలుస్తోంది.

బాలుడు ఆగివున్న కారుకు ఆనుకుని ఉండటం, అందులో నుంచి బయటకు వచ్చిన యువకుడు బాలుడిని తన్నడం వీడియోలో కనిపిస్తోంది.అనంతరం స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజనులు ఫైర్ అవుతున్నారు.
పోలీసులు ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే స్థానికులు మాత్రం పోలీసులు యజమాని వైపే మాట్లాడుతూ ఈ మేటర్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
అయితే సీసీటీవీ ఫుటేజీ బాగా వైరల్ కావడంతో శుక్రవారం ఉదయం పోలీసులు అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.







