టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే మాయదారి రోగం తో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఆమె ఎప్పుడెప్పుడు ఆ జబ్బు నుండి కోలుకుంటుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సమంత ఇటీవల యశోద సినిమా యొక్క డబ్బింగ్ కార్యక్రమాలను బెడ్ పై ఉండే పూర్తి చేసింది.సమంత కనీసం బెడ్ నుండి లేచి తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉందంటూ ఆ ఫోటో ను చూస్తుంటే అనిపిస్తుంది అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఆమె హీరోయిన్ గా నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.నవంబర్ 11 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమా ల్లో సమంత పాల్గొనలేక పోతుంది.
ఇదే సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
సమంత సినిమా ప్రమోషన్ లో పాల్గొనక పోవడం తో సినిమా కు కచ్చితం గా మైనస్ అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండగా మరి కొందరు మాత్రం సింపతీ కలిసి వస్తుందేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత అనారోగ్యం తో బాధపడుతుండగా ఆమె నటించిన యశోద సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఆమె పై ఉన్న సింపతి తో ఎక్కువ మంది జనాలు థియేటర్ల కు క్యూ కట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ సింపతీ అనేది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో క్లారిటీ లేదు.
![Telugu Samantha, Samantha Fans, Varalaxmisharat, Yashoda-Movie Telugu Samantha, Samantha Fans, Varalaxmisharat, Yashoda-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/11/samantha-yashoda-film-news-detailss.jpg )
అయితే ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం అనేది సినిమా కు చాలా పెద్ద డ్యామేజ్ అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.ఈ సినిమా లో సమంత ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతుంది.సరోగసి మదర్ గా సమంత ను ఈ సినిమా లో చూపించబోతున్నారు.డబ్బు కోసం సరోగసి మదర్ గా అయ్యేందుకు సమంత ఒకే చెప్తుంది.కానీ అక్కడ జరిగే అన్యాయాలను ఆమె గర్భవతిగానే ఎలా ఎదిరిస్తుంది అనేది చూపించబోతున్నారట.ఈ సినిమా లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయంటూ చిత్ర యూనిట్స్ సభ్యులు పదే పదే చెప్తున్నారు.
సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
.