శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని మాదాపూర్ –    శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి V.

 All India 27th Crafts Mela Inaugurated By Minister Srinivas Goud In Shilparamam-TeluguStop.com

శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం శిల్పారామం ఆధ్వర్యంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళా ను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సంవత్సరం నిర్వహిస్తున్న క్రాఫ్ట్ మేళాలో 500 పైగా వివిధ రకాలైన క్రాఫ్ట్ స్టాల్స్ ను దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు, స్టాల్ల్స్ నిర్వాహకులు, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ కళాకారులు సంత్ కబీర్, శిల్ప గురువ్ ల తో పాటు 200 మంది కళా నైపుణ్యం ఉన్న కళాకారులు, శిల్పకళా వేదికలో ఉన్న కళాకారులు సమిష్టిగా ఎన్నో కళాకృతులను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు.ఈ క్రాఫ్ట్ మేళను నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ( 15.12.2021 నుండి 31.12.2021) నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ క్రాఫ్ట్ మేళా లో హస్తకళలు, చెక్క బొమ్మలు, జౌళి సంచులు, బొంగు తో తయారు చేసిన ఉత్పత్తులు, నారతో చేసిన ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి  సాధారణ ధరలలో అందుబాటులో ఉంటాయన్నారు.ఈ సందర్భంగా క్రాఫ్ట్ మేళా లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

Telugu Chenetha, Cm Kcr, Crafts Mela, Handicrafts, Madhapur, Srinivas Goud, Ship

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు.అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శిల్పారామం లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్త కళాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు.వారు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి మరిన్ని మేళాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Telugu Chenetha, Cm Kcr, Crafts Mela, Handicrafts, Madhapur, Srinivas Goud, Ship

అనంతరం క్రాఫ్ట్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.ఈ క్రాఫ్ట్ మేళా కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని శిల్పారామం అధికారులను ఆదేశించారు మంత్రి V.శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో శిల్పారామం స్పెషల్ ఆఫీసర్  శ్రీ కిషన్ రావు, జాతీయ చేనేత , జౌళి శాఖల అధికారులు అరుణ్ కుమార్, నర్సింహులు, జనరల్ మేనేజర్ అంజయ్య గార్లు , శిల్పారామం సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube