ఆర్ఆర్ఆర్ కేరాఫ్ తారక్.. మరి చరణ్?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 All Highlight Episodes In Rrr Are Of Ntr Only, Rrr, Ntr, Ram Charan, Rajamouli,-TeluguStop.com

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ మొదలుకొని రామ్ చరణ్, తారక్‌ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ల వరకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే అంశాలు చాలానే ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా ఇప్పటివరకు బయటకొచ్చిన వార్తల్లో ఎక్కువ హైలైట్ సీక్వెన్స్‌లు తారక్‌కు సంబంధించినవే కావడం విశేషం.ఈ సినిమాలో తారక్ ఓ పెద్దపులితో చేసే పోరాటం మొదలుకొని భారీ రైలు యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌, ఇలా వరుసబెట్టి అన్నింట్లో తారక్‌ను హైలైట్ చేస్తూ చూపెట్టేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

దీంతో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టీజియస్ మూవీలోని హైలైట్ సీన్స్ అన్ని కూడా తారక్‌పైనే తీస్తే, తమ హీరోను ఎలా చూపెడతాడా అని వారు జక్కన్నపూ గుర్రుమంటున్నారు.

అయితే చరణ్ స్క్రీన్‌పై కనిపించడమే హైలైట్ కానుందని మరికొందరు అంటున్నారు.ఏదేమైనా ఇప్పటివరకు సినిమా వర్గాల్లో వినిపిస్తున్న ఆర్ఆర్ఆర్ హైలైట్ ఎపిసోడ్స్ అన్ని కూడా తారక్‌వే కావడంతో ఆయన ఈ సినిమాలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube