తెలంగాణ ఎన్నికలు ( Telangana Elections ) దగ్గర పడుతున్న కొద్ది పార్టీలలో టెన్షన్ మొదలవుతుంది.మరీ ముఖ్యంగా గులాబీ దళం లో గుబులు స్టార్ట్ అవుతుంది.
ఎందుకంటే ఇప్పటికే గులాబీ బాస్ అయినా కేసీఆర్ ( KCR ) ఓవైపు కామారెడ్డిలో మరోవైపు గజ్వేల్ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు.ఇక గజ్వేల్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గట్టి పోటీ ఇస్తూ ఉంటే కామారెడ్డిలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు.
అయితే గజ్వేల్ లో ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన కేసీఆర్ మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అనే ధీమాతోనే ఉన్నారు.అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేను ని ప్రచారం జరుగుతుంది కాబట్టి అక్కడ బిజెపి గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా పెద్ద ప్రయోజనం లేదని రెండు మళ్లీ తెరవెనక ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారు.

అయితే రాష్ట్రం చూపు మొత్తం ప్రస్తుతం కామారెడ్డి ( Kamareddy ) నియోజకవర్గం పైనే ఉందట.ఎందుకంటే ఈ నియోజకవర్గం లో కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చంకలు గుద్దుకుంటారు.మా నాయకుడి పైన మీ నాయకుడు ఎంత అనేలా మాటల తూటాలు పేల్చుతారు.అందుకే ప్రస్తుతం అందరి చూపు కామారెడ్డి పైన ఉంది.కేవలం ప్రజలు మాత్రమే కాదు నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గ పైనే దృష్టి సారించారు.మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు,కేటీఆర్, కవిత వీళ్ళందరూ కామారెడ్డిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.

ఈనెల 24న హరీష్ రావు ( Harish rao ) జుక్కల్ లో ఎన్నికల సభ పెట్టబోతున్నారు.ఆ తర్వాత రెండు రోజులు కేటీఆర్ రోడ్ షో చేస్తూ ప్రచారం చేయబోతున్నారు ఇక ఈ నియోజకవర్గం పైనే బీఆర్ఎస్ నేతలందరూ దృష్టి పెట్టారు అన్నట్టు తెలుస్తుంది.కేవలం బీఆర్ఎస్ వాళ్ళే కాకుండా జుక్కల్ లో ఈనెల 24న రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ లో పాల్గొనబోతున్నారు.అంతేకాకుండా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,రేవంత్ రెడ్డిలు కూడా జుక్కల్ లో రోడ్ షో చేయబోతున్నారు.
ఇక ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వీళ్ళు కూడా ప్రచారం జోరుగా చేస్తున్నారు.అలాగే ఈటెల రాజేందర్ ( Etela Rajender ) కూడా నవంబర్ 24న ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం.
ఇలా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కామారెడ్డి పైనే దృష్టి పెట్టారు.ఇక ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అని ఇప్పటికే సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు పార్టీ అధికారులు.
మరి చూడాలి ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంటుందో.