మళ్లీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి! ఎగ్జిట్ పోల్స్ లో సత్తా చాటిన బిజెపి

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికార పార్టీ బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టంగా తెలియజేయడం దేశవ్యాప్తంగా సంచలనం మారింది.

లోక్ సభ చివరి దశ పోలింగ్ ముగియడంతో పాటు వీడియో సంస్థల ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో జాతీయ మీడియా చానల్స్ తో పాటు కొన్ని రాజకీయ సంస్థలు ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటించాయి.

ఇందులో చాలా వరకు మీడియా సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి 280 సీట్లకు పైగా ఆధిపత్యం చూపించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశాయి.రిపబ్లిక్ టీవీ సి వాటర్ సర్వేలో బీజేపీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి 287 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 128 సీట్లకు సొంతం చేసుకుంటుందని చెప్పగా, రిపబ్లిక్ భారత్ సర్వేల్లో ఎన్డీఏ కూటమి 305 సీట్లు సొంతం చేసుకుంటుందని తెలియజేసింది.

న్యూస్ నేషన్ సర్వేలో ఎన్డీఏ కూటమి 282 నుంచి 290 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం చూపిస్తుందని తెలియజేసింది.మొత్తంమీద ఈ ఎన్నికల్లో ఫలితాల సరళి పూర్తిగా బిజెపి పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ బట్టి అర్థమవుతుంది.

కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన యాంటీ బిజెపి మోడీని నినాదం దేశ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపించలేదని ఫలితాలను బట్టి తెలుస్తుంది.

Advertisement
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తాజా వార్తలు