పెళ్లికి ముందే గర్భవతిని.. తప్పేంటి.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న అలియా భట్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే.పెళ్లి జరిగిన కొన్నిరోజులకే అలియా భట్ తాను గర్భవతిని అని చేసిన ప్రకటన అభిమానులను షాక్ కు గురి చేసింది.

 Alia Bhatt Shocking Comments About Her Pregnancy Details Here Goes Viral , Al-TeluguStop.com

కొంతమంది అలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి అని ఆ సమయంలో సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

గతేడాది నవంబర్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ తన గురించి వైరల్ అయిన నెగిటివ్ కామెంట్ల గురించి సైతం స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

మ్యారేజ్ కు ముందు తాను ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని ఆ సమయంలో అప్పటికే తాను గర్భవతిని కావడంతో యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని అలియా భట్ పేర్కొన్నారు.

నేను గర్భవతిననే విషయం సినిమా యూనిట్ కు తెలుసని అందువల్ల యాక్షన్ సీన్లు చేసే సమయంలో వాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని అలియా భట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పెళ్లికి ముందు గర్భవతి కావడంలో తప్పే లేదనే విధంగా అలియా భట్ పరోక్షంగా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.గర్భవతి కావడం వల్లే అలియా భట్ పెళ్లి చేసుకున్నారని జరిగిన ప్రచారం నిజమేనని ఈ వార్తల ద్వారా స్పష్టత వచ్చింది.

మరోవైపు అలియా భట్ కు సౌత్ నుంచి ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా ఆమె మాత్రం ఆ ఆఫర్లకు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది.అలియా భట్ సౌత్ సినిమాలలో నటిస్తే ఆమెకు క్రేజ్, గుర్తింపు మరింత పెరుగుతాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరి అలియా భట్ మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube