వాట్సాప్ స్టోరేజీని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇలా క్లియర్ చేసుకోండి!

ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని మనిషే ఉండడు అంటే అతిశయోక్తి లేదు.ఈ క్రమంలో ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ కూడా వుండదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే.

 Clear Whatsapp Storage In Android Phones With This Process Details, Whatsapp, St-TeluguStop.com

అంతలా మార్కెట్లో పాపులర్ అయింది వాట్సాప్.వాట్సాప్ లేనిదే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్‌లు కూడా లేవు.

రోజురోజుకీ పెరిగిపోతున్న యూజర్ల వలన వాట్సాప్ పని మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంది.ఈ నేపథ్యంలో చాలామందిని ఓ సమస్య వేధిస్తోంది.

అదే వాట్సాప్ స్టోరేజీ క్లియరెన్స్.

అవును, రోజురోజుకీ ఇండిపెండెంట్ వాట్సాప్ అకౌంట్ల నుంచి, అలాగే వాట్సాప్ గ్రూపు అకౌంట్ల నుండి వచ్చే మెసేజ్‌లు కావచ్చు, ఇమేజ్ లు కావచ్చు, వీడియోలు కావచ్చు, స్టిక్కర్లు కావచ్చు….

వీటి వలన యూజర్లు అనేక ఇబ్బందులు పడుతూ వుంటారు.ఎందుకంటే వాటి వలెనే ఆండ్రాయిడ్ స్టోరేజీ నిత్యం ఫుల్ అయిపోతూనే ఉంటుంది.అలా పెద్ద మొత్తంలో స్టోర్ అయ్యే అన్ వాంటెడ్ స్టఫ్ వలన ఉపయోగం లేకపోగా అనేక నష్టాలకు దారితీస్తోంది.ఇక మాన్యువల్‌గా డిలీట్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని.దానికోసం విలువైన సమయాన్ని వెచ్చించాలి.

ఈ నేపథ్యంలో వాట్సాప్ స్టోరేజ్ స్పేస్‌ను ఎలా ఖాళీ చేయాలో ఇపుడు తెలుసుకుందాం.దానికి మీరు మొదటగా WhatsApp ఓపెన్ చాట్స్ ట్యాబ్‌కు వెళ్లండి.ఆ తరువాత ఆప్షన్లపైన క్లిక్ చేసి, సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి.

ఇపుడు స్టోరేజీ, డేటాపై Tap చేయండి.ఇప్పుడు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ కనబడుతుంది.

అక్కడ ఎగువన, యూజర్లు అనేకసార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ చూడవచ్చు.దాని కింద, 5MB కన్నా భారీ ఫైల్‌లు వున్నట్లైతే ఒక్కొక్కటిగా ఎంచుకుని తొలగించే ఆప్షన్ Tap చేయండి.

దాంతో వాటన్నింటినీ ఎంచుకుని, Delete చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube