Aaliya Bhatt Daughter Name: కూతురికి పేరు పెట్టిన హీరోయిన్ అలియా భట్.. ఆ పేరుకు అర్థం ఏంటంటే?

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ కొన్నిరోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.అలియా భట్ రణ్ బీర్ కపూర్ కూతురు పేరుకు గతంలో ఎన్నో వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.

 Aliya Bhatt Daughter Name Details, Aliya Bhatt Daughter Name, Alia Bhatt, Alia B-TeluguStop.com

అలియా భట్ తన కూతురుకు రహా అని పేరు పెట్టడం గమనార్హం.రహా అంటే ఆనందం అని అర్థం అని అలియా భట్ వెల్లడించారు.

తన కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆమె ఈ పేరును ఫిక్స్ చేశారు.

రణ్ బీర్ కపూర్ జెర్సీపై కూతురు పేరును ముద్రించి ఆ జెర్సీని గోడకు అతికించి ఫోటో దిగారు.

రహా పుట్టడంతో తమ లైఫ్ ఇప్పుడే మొదలైందనే భావన కలుగుతోందని ఆమె కామెంట్లు చేశారు.సంతోషకరమైన క్షణాలు ముందున్నాయని అలియా భట్ అన్నారు.కూతురి ముఖాన్ని కూడా అలియా భట్ దంపతులు చూపించి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలియా భట్ కూతురి పేరుకు ప్రశాంతత, స్వేచ్ఛ, ప్రశాంతత, వంశం అనే అర్థాలు కూడా వస్తాయని సమాచారం.

Telugu Alia Bhatt, Alia Bhatt Raha, Aliabhatt, Aliya Bhatt, Ranbir Kapoor-Movie

మరోవైపు అలియా భట్ కూతురు పుట్టిన సంతోషంలో సినిమాలకు దూరం కావాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.కూతురు తన జీవితంలోకి రావడంతో తన జీవితం మారిపోతుందని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది.

అలియా భట్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను సైతం వదులుకునే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అలియా భట్ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుండగా మరి కొంతమందిని ఎంతగానో బాధ పెడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube