భారతీయులకు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ శామ్‌సంగ్. అందుకే చాలామంది ఈ బ్రాండ్ నుంచి రిలీజ్ అయ్యే డివైజ్‌లను కొనుగోలు చేస్తుంటారు.
ఈరోజుల్లో ఇండియాలో 5g మొబైల్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.శామ్‌సంగ్ ఇప్పటికే ఎన్నో 5జీ మొబైల్స్ ఇండియాకి తీసుకొచ్చింది.
ఇదే ఏడాది మళ్లీ ఇంకో కొత్త మొబైల్ ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.గెలాక్సీ ఏ23 5జీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ జపాన్‌లో ఆల్రెడీ లాంచ్ అయ్యింది.
ఇండియాలో డిసెంబర్ నెలలో ఇది విడుదల అయ్యే అవకాశం ఉంది.దీని ధర రూ.25 వేల లోపు ఉండొచ్చని అంచనా.
ఈ మొబైల్ బాక్స్‌లో ఛార్జర్‌ని కంపెనీ అందించడం లేదు.
శామ్‌సంగ్ గెలాక్సీ A23 5జీని 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది.వాటర్‌డ్రాప్ నాచ్, స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్, 5.8-అంగుళాల TFT ఎల్‌సీడీ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది.అయితే 5జీ ప్రాసెసర్ తక్కువ ధరల్లో ఇచ్చేందుకు డిస్‌ప్లే క్వాలిటీని శామ్‌సంగ్ తగ్గించినట్లు తెలుస్తోంది.IP68 రేటింగ్, 168 గ్రాముల బరువు, 9 మిమీ మందంతో ఇది వస్తుంది.ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్‌యూఐ 4.1 వెర్షన్‌పై ఫోన్ నడుస్తుంది.గెలాక్సీ A23 5G వెనుకవైపు ఒకే 50-మెగాపిక్సెల్ కెమెరా.ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ స్నాపర్ ఉన్నాయి.ఫోన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీతో, 25W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేస్తుంది.అయితే మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి.
దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి
.






