ఒక్క డ్రెస్ కోసం అంత ఖర్చు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ.. హాట్ టాపిక్ చర్చ!

అలియా భట్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు లేరంటే అతియసోక్తి కాదేమో.ఈమె అందం, అభినయం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టు కుంటాయి.

తన నటనతో తక్కువ సమయం లోనే అందరి చేత శబాష్ అనిపించుకుని స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కనిపించింది.ఇది ఇలా ఉండగా అలియా నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

గంగూబాయి, ఆర్ ఆర్ ఆర్ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతుంది.యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి.

Advertisement

ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.హాట్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించారు.

ఇటీవలే వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది.పెళ్లి తర్వాత వీరు కలిసి చేసిన ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.ఈ సినిమాను ప్రోమోట్ చేసేందుకు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు మేకర్స్.

వీరితో పాటు అలియా కూడా అన్ని చోట్ల తన బేబీ బంప్ తో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది.ఈమె జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.ఇందులో తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఉంది.

Advertisement

గూచీ బ్రాండ్ కు చెందిన పింక్ టాప్ లో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది.ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఈమె ధరించిన ఈ బ్రాండెడ్ టాప్ ఖరీదు తెలిసి అంతా నోరెళ్ళ బెడుతున్నారు.

ఈ పింక్ కలర్ ఉల్లి పొర లాంటి డ్రెస్ లో అలియా మరింత అందంగా భర్త పక్కన మెరిసిపోతుంది.ఈ టాప్ 4100 డాలర్స్ అని చెబుతున్నారు.అంటే మన కరెన్సీ లో అక్షరాలా రూ.327883 అట.ఈ డేస్ ఇంత ఖరీదు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

కేవలం టాప్ కోసమే ఈమె ఇంత ఖర్చు చేయడం బాలీవుడ్ మీడియాల్లో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.మరి సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ సినిమాతో భార్యాభర్తలు ఇద్దరు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

తాజా వార్తలు