బాలీవుడ్ అందాల భామ అలియా భట్ తెలుగులో ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీత పాత్రలో అలియా నటన ఆడియన్స్ ని మెప్పించింది.
ఇక ఈ సినిమా తర్వాత అలియా భట్ తెలుగులో నటించాలన్న ఆసక్తి చూపిస్తున్నా సరే అవకాశాల మాత్రం ఇవ్వట్లేదు.ఆర్.ఆర్.ఆర్ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమా చేసిన అలియా భట్ మరో తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తుంది.
అయితే అలియా చేస్తానన్నా సరే తెలుగు నిర్మాతలు ఆమెకు అవకాశం ఇవ్వట్లేదు.ఈమధ్య బాలీవుడ్ భామలంతా కూడా తెలుగులో వరుస కడుతున్నారు.ప్రాజెక్ట్ K లో దీపికా పదుకొనె నటిస్తుంది.చరణ్ గేం చేంజర్ లో ఆల్రెడీ కియరా అద్వాని కూడా ఛాన్స్ అందుకుంది.
ఇలా బాలీవుడ్ భామలంతా కూడా తెలుగు సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారు.రణ్ బీర్ కపూర్ తో పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో వెనక్కి తగ్గట్లేదు అలియా భట్.
జాన్వి కపూర్ కూడా ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో నటిస్తుంది.అందుకే అలియా ఫుల్ ఫోకస్ తెలుగు తెర మీద మళ్లీ మెరవాలని అనుకుంటుంది.