బ్రా బయటకు కనిపిస్తే తప్పు ఏంటి.. డైరెక్ట్ గా ప్రశ్నించిన హీరోయిన్!

కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు వ్యక్తిగత విషయాల పట్ల బాగా రియాక్ట్ అవుతుంటారు.అంతేకాకుండా సమాజాన్ని అడగవలసిన ప్రశ్నలను నేరుగా కూడా అడుగుతారు.

ముఖ్యంగా స్త్రీల విషయంలో సమాజం తప్పుగా దూషిస్తే వెంటనే అడుగుతుంటారు.తాజాగా ఒక హీరోయిన్ కూడా స్త్రీ విషయంలో సమాజం చూసే తప్పు గురించి నేరుగా అడిగింది.

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే.బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.

ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Advertisement

హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

తెగ వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.కెరీర్ మొదట్లో కాస్త లావుగా ఉన్న ఆలియా భట్ రాను రాను తన శరీరాన్ని నాజుగ్గా మార్చుకుంటుంది.

నిత్యం యోగాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.అందం విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఇక ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ తో ఐదు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఆ సమయంలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

Advertisement

ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారాయి.బాలీవుడ్ లో ఈ జంట కూడా క్యూట్ కపుల్ గా నిలిచింది.

అంతేకాకుండా ఇద్దరూ పలు ప్రాజెక్టులలో కూడా బాగా అవకాశాలు అందుకున్నారు.ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ప్రేక్షకులకు, తన అభిమానులకు గుడ్ న్యూస్ కూడా వినిపించింది.త్వరలో ఆలియా భట్ తల్లి కాబోతుంది.

దానికి సంబంధించిన ఫోటో కూడా తాను తన ఇన్ స్టా లో పంచుకోగా అది చూసిన నెటిజన్లు, తన అభిమానులు లైకులు కొడుతున్నారు.అంతేకాకుండా ఆ ఫోటోకు త్వరలో పాపాయి రాబోతుంది అని క్యాప్షన్ కూడా పెట్టింది.

ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బాలీవుడ్ ప్రముఖులు కూడా తనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీ వేదింపుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఓ వ్యక్తి చేసిన సెక్స్సిస్ట్ కామెంట్ తనకు చిరాకు తెప్పించాయని వాటి వల్ల తను కలత చెందానని తెలిపింది.ఇక ఎవరైనా.

మహిళలు తమ శరీరాన్ని దాచుకోవాలని చెప్పినప్పుడు భరించలేని కోపం వస్తుందని అన్నది.బ్రా బయటకు కనిపించకూడదు.

ఇంట్లో ఎలా పడితే అలా బెడ్ పై దుస్తులు పడేయకుండా దాచి పెట్టాలి.అలాంటి మాటలు తనకు నచ్చవని తెలిపింది.

అయినా అలా బయటికి కనిపిస్తే తప్పు ఏంటి అని ప్రశ్నించింది.

తాజా వార్తలు