టాలీవుడ్ బుల్లితెర, వెండితెర నటుడు అలీ రెజా గురించి అందరికీ పరిచయమే.ఈయన బుల్లితెరలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని తన గేమ్ తో, తన ఉండే విధానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా ఈ షో తోనే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.నిజానికి బిగ్ బాస్ ముందు ఈయన పరిచయం గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు.
కానీ బిగ్ బాస్ తర్వాత తనేంటో తాను నిరూపించుకున్నాడు.
తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించాడు.ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి అమృతం చందమామ అనే సినిమాతో 2014లో పరిచయమయ్యాడు.
ఈ సినిమాతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.ఇక అదే సమయంలో గాయకుడు, సినీ మహల్ అనే సినిమాలో కూడా నటించాడు.
ఇక ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని పెంచుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత నా రూటే సపరేటు, హైదరాబాద్ నవాబ్స్ 2, వైల్డ్ డాగ్, మెట్రో కథలు వంటి సినిమాలలో నటించగా.
అందులో వైల్డ్ డాగ్ సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించాడు.అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.కానీ వెండితెర పై అడుగు పెట్టాక ఇక సీరియల్స్ కు దూరంగా ఉంటూ సినిమాలతో బాగా బిజీ అయ్యాడు.
ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.తన భార్య మాసుమ్ తో కలిసి దిగిన ఫోటోలను, తనతో చేసిన వీడియోలను బాగా పంచుకుంటాడు.అంతే కాకుండా ఆ మధ్య తాను ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వగా ఆ బేబీ కి సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటాడు.అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా బాగా షేర్ చేస్తూ ఉంటాడు.
ఇక ఈయనతో పాటు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న మరికొంతమంది కంటెస్టెంట్ లతో మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ను కొనసాగిస్తున్నాడు.
వారితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ఉంటాడు.ఇక ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియాలో ఒక క్రూరమైన వీడియో షేర్ చేసుకున్నాడు.ఇక ఆ వీడియోలో ఏముందంటే.
ఒక కీటకం వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లో పడగా.అందులో అది గిలగిల కొట్టుకుంటూ కనిపించింది.
దీంతో ఆ వీడియోకి అతడు.కొందరు ఇలానే ప్రేమలో పడతారు అని అన్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.