ఇటీవల కాలంలో వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్( Netflix ) నష్టాలను భరించలేక సతమతమయ్యింది.అయితే ఎట్టకేలకు ఈ కంపెనీ ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ ప్రాఫిట్స్ ను మరింత పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ వడివడిగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ‘పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్‘ ఫీచర్‌ను విడుదల చేయడానికి సమాయత్తమవుతోంది.

ఈ ఫీచర్ రిలీజ్ అయిన తర్వాత యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వ్యక్తులతో పంచుకున్నప్పుడల్లా అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పుడు మాత్రం సబ్‌స్క్రైబర్లు ఉచితంగానే తమ అకౌంట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు.ఇకపై ఇది జరగబోదు.దీనివల్ల నెట్‌ఫ్లిక్స్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ సిస్టమ్( Paid Password Sharing ) ఈ ఏడాది జూన్ నెలకు ముందే రిలీజ్ కావచ్చు.ఇకపోతే నెట్‌ఫ్లిక్స్ మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య 2023 మొదటి త్రైమాసికంలో 23.25 కోట్లకి ఎగబాకింది.యూజర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ లాభాలు కూడా పెంచుకోవాలని నెట్‌ఫ్లిక్స్ ఆశిస్తోంది.
అందుకే త్వరితగతిన పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ సిస్టమ్ లాంచ్ చేసి ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

అంతేకాకుండా, యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్( Ad-supported plan )ను కూడా కొద్ది రోజుల క్రితం లాంచ్ చేసింది.మొత్తంగా చాలా వ్యూహాలు అవలంబించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ గత మూడు నెలల్లో సుమారు రూ.10 వేల కోట్లు డాలర్ల ప్రాఫిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ వల్ల సబ్‌స్క్రైబర్స్‌కి సెక్యూరిటీ పరంగా మేలు చేసినట్లు అవుతుందని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది.







