ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించని వారిపై ఫైన్లు, చలానాలను వేస్తూ వస్తున్నారు ట్రాఫిక్ అధికారులు.అయితే ఇకమీదట ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ కూడా తప్పనిసరిగా చేయాలట.
అలా ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయకపోతే ఆ వాహనానికి ఇకమీదట చలానా వేసే అవకాశం ఉంది.ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ బ్లాక్ లను తొలగించే ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.
ఈసారి కొత్త విధానంలో, కదిలే వాహనం నుంచి మాత్రమే టోల్ వసూలు జరుగుతుంది.ఇందుకోసం NHAI, రోడ్డు రవాణా – రహదారుల మంత్రిత్వ శాఖ కలిసి కొత్త నిబంధనలను రూపొందిస్తున్నాయి.
ఈ పథకానికి కనుక కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభిస్తే, ముందుగా ఈ వ్యవస్థ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే లో అమలు చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు.ఎందుకంటే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఆధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త పథకానికి ఆమోదం వచ్చిన తర్వాత ఏ వాహనం అయినా సరే ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా గాని, లేదంటే రుసుము చెల్లించకుండా గాని ప్రయాణిస్తే చలానా కట్టక తప్పదు.ఒకవేళ అదే వాహనం ఎక్కువసార్లు చలానా కడితే మాత్రం ఆ వాహనాన్ని RC బ్లాక్ లిస్ట్ పెడతారు.ప్రస్తుతానికి ఈ అంశం పరిశీలనలో ఉంది.రాబోయే రోజుల్లో మాత్రం ఇది అమలు చేసే అవకాశం అయితే కచ్చితంగా ఉందనే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి టోల్ పాయింట్ల వద్ద అల్ట్రా-ఆధునిక కెమెరాలు అమర్చుతారు.ఈ కెమెరాలు కదిలే వాహనం నంబర్ ప్లేట్, ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా దూరాన్ని బట్టి టోల్ మొత్తం అటోమేటిక్ గా వసూలు చేస్తారు.
ఒకవైపు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వాహనం వెళితే, దాని ఫుటేజీ కెమెరాలో రికార్డ్ అవుతుంది.అలా రికార్డ్ అయిన దాన్ని బట్టి ఆ వాహనానికి జరిమానా, చలానా గురించిన సమాచారం మొత్తం ఆ వాహన యజమాని మొబైల్ కు SMS రూపంలో వెళుతుంది.
ఈ మొత్తం వ్యవస్థ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
ఇందులో ఎలాంటి పత్రాలు అవసరం లేదు.
ఒకవేళ జరిమానా చెల్లించకుంటే ఫాస్ట్ ట్యాగ్ కంపెనీ నోటీసులు పంపుతుంది. మరి ఈ ఫాస్ట్‌ట్యాగ్ ఆన్‌లైన్ రీఛార్జ్ ఎలా చేయాలో కూడా చూడండి ఫాస్ట్‌ట్యాగ్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడం చాలా సులువు.
మీ మొబైల్‌లో పేటీఎం ఉంటే మీరు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు.ముందుగా పేటీఎంలో ఫాస్టాగ్ రీఛార్జ్ ఎంపికకు వెళ్లండి.
అక్కడ ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకును ఎంచుకుని వాహనం నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.ఆ తరువాత ప్రొసీడ్ పై క్లిక్ చేసి రీఛార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
అక్కడ మీరు పేమెంట్ కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం వాలెట్ లేదా UPI ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.