క్రికెట్ ఫ్యాన్స్ కు అలర్ట్.. ఇక ఐపీఎల్ లైవ్ ఆ యాప్ లోనే

ఇండియాలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ క్రికెట్ ఆడేందుకు, చూసేందుకు ఇష్టపడతారు.

 Alert For Cricket Fans Ipl Live In The App, Cricket, Fans, Good News, Sports U-TeluguStop.com

టీవీలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది.

క్రికెట్ మ్యాచ్ లను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.దేశాల మధ్య ఐసీసీ నిర్వహించే మ్యాచ్ ల కంటే ఇప్పుడు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టీ10, టీ20 టోర్నీలపై క్రికెట్ అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు టీ10, టీ20 మ్యాచ్ లు ఎక్కువ పాపులర్ అయిపోయాయి.ప్రపంచవ్యాప్తంగా బిగ్ బ్యాష్, పీఎస్ ఎల్ లాంటి టీ20 టోర్నీలు జరుగుతుండగా.బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాగా పాపులర్ అయింది.అన్ని దేశాల స్టార్ క్రికెటర్లతో నిర్వహించే ఈ టోర్నీ క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రపంచంలోనే పాపులర్ క్రికెట్ టోర్నీగా ఐపీఎల్ గుర్తింపు పొందింది.దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు క్రికెటర్లు బాగా ఆసక్తి చూపుతారు.

ఇక ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి కూడా విపరీతంగా ఆదాయం వస్తుంది.ప్రాంచైజీల ఫీజులతో పాటు టీవీ, డిజిటల్ హక్కుల ద్వారా కోట్ల రూపాయాలు బీసీసీఐకు వస్తున్నాయి.తాజాగా ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కుల వేలం జరగ్గా.టీవీ హక్కులను సోనీ నెట్ వర్క్ దక్కించుకుంది.

ఇక డిజిటల్ హక్కులను వయాకాం 18 దక్కించుకుంది.టీవీ హక్కులు రూ.23,575 కోట్లకు, డిజిటల్ రైట్స్ రూ.20,500 కోట్లకు అమ్ముడుపోయాయి.

దీంతో బీసీసీఐకు రూ.44,075 కోట్లు వచ్చాయి.గతంలో టీవీ, డిజిటల్ హక్కులు స్టార్ గ్రూపు వద్ద ఉన్నాయి.దీంతో డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో ఐపీఎల్ లైవ్ చూసే అవకాశం ఉండేది.ఇప్పుడు ఆ హక్కులను వయాంకా 18 దక్కించుకోవడంతో.ఆ కంపెనీకి చెందిన వూట్ యాప్ లో ఐపీఎల్ ప్రసారం కానుంది.ప్రస్తుతం వూట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి రూ.299గా ఉంది.ఒకేసారి నాలుగు డివైస్ లలో వాడుకోవచ్చు.అయితే ఐపీఎల్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో సబ్ స్క్రిప్షన్ ఫీజు పెంచే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube