మావయ్యకే నా మద్దతు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి?

నందమూరి తారకరత్న ( Taraka Ratna ) భార్య అలేఖ్య రెడ్డి ( Alekhya Reddy ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.నందమూరి తారకరత్న రాజకీయాలలోకి అడుగుపెట్టిన తర్వాత అనుకోకుండా అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

 Alekhya Tarakaratna Support To Nandamuri Balakrishna, Balakrishna, Alekhya Red-TeluguStop.com

ఇలా తారకరత్న మరణించిన తర్వాత ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే అలేఖ్య రెడ్డి స్వయంగా విజయసాయి రెడ్డికి కూతురు వరుస అవుతుందని సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విజయ్ సాయి రెడ్డి( Vijay Sai Reddy ) తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇలా విజయసాయిరెడ్డి అలాగే బాలకృష్ణ ( Balakrishna ) కూడా ఈమెకు బంధువులు కావడంతో వీరిద్దరితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో తన మద్దతు పెదనాన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ఇస్తారా లేకపోతే మామయ్య టిడిపి పార్టీకి ఇస్తారా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.ఇక ఈ విషయం గురించి అలేఖ్య రెడ్డికి పదేపదే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నటువంటి తరుణంలో తాజాగా ఈమె క్లారిటీ ఇచ్చారు.తన పిల్లలతో బాలయ్య కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె అందరూ పదేపదే నన్ను ఒకటే ప్రశ్న వేస్తున్నారని ఎవరికి మద్దతు తెలుపుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఎక్కడైతే ప్రేమ, మానవత్వం ఉంటుందో అక్కడే నా మద్దతు ముఖ్యంగా నా ఫ్యామిలీకి నా సపోర్ట్ అని తెలిపారు.నాకు, ఓబు, పిల్లలకు మీరంటే చాలా ఇష్టం మావయ్య అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube