ఆల్కహాల్‌ వల్లే 62 వేల కేన్సర్‌ కేసులు!

భారత్‌లో గత సంవత్సరం అంటే 2020లో దాదాపు 62 వేల కేన్సర్‌ కేసులు కేవలం ఆల్కహాల్‌ తీసుకోవడం వల్లే కేన్సర్‌ భారినపడినట్లు ది ల్యాంసెట్‌ ఒన్‌కాలజీ జర్నల్‌ ప్రకటించింది.దీంతో దేశంలో మద్యం ఎలా పారుతుందో తెలుస్తోంది.

 Alcohol Drinking Linked To Over 62,000 New Cancer Cases , Alcohol , Alcohol Drin-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య దాదాపు 7,40,000 లేదా నాలుగు శాతం కేన్సర్‌ కేసులు 2020లో కేవలం మద్యం సేవించడం వల్లే వచ్చిన వి.దీంట్లో మగవారి సంఖ్య 77 శాతంతో (5,68,700) ఉండగా, ఆడవారి సంఖ్య 23 శాతంతో (172,600) కేన్సర్‌ బారినడ్డారు.ముఖ్యంగా ఈ కేన్సర్‌ ఒసోఫగస్, లివర్, బ్రెస్ట్‌ కేన్సర్‌ల బాధితులు ఎక్కువ ఉన్నారు.గత సంవత్సరం డేటా ప్రకారం 6.3 మిలియన్‌ కేసులు నోటి, ఫారైంక్స్, వాయిస్‌ బాక్స్, ఒసెఫగల్, కొలన్, రెక్టమ్, లివర్, బ్రెస్ట్‌ కేన్సర్‌ బాధితులు ఉన్నారు.కేన్సర్‌కు ఆల్కహాల్‌తో ఈ విధంగా సంబంధం ఉంటుంది.

యూరోపియన్‌ దేశాల్లో ఆల్కహాల్‌ సేవించడం తగ్గింది.కానీ, ఆసియా దేశాల్లో ముఖ్యంగా చైనా, ఇండియా, సహారన్‌ ఆఫ్రీకా దేశాల్లో ఆల్కహాల్‌ తీసుకునేవారి సంఖ్య పెరిగిందని ప్రాన్స్‌కు చెందిన ఇంటర్నేష్‌నల్‌ ఏజెన్సీ ఫర్‌ కేన్సర్‌ పరిశోధకులు హరియత్‌ రంగే తెలిపారు.

అంతేకాదు కొన్ని దేశాల్లో అయితే కొవిడ్‌ 19 వల్ల ఆల్కహాల్‌ సేవించేవారి సంఖ్య పెరిగింది.కేన్సర్‌ బాధితులు ఎక్కువ శాతం ఉన్న దేశాల్లో దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, ప్రభుత్వం కూడా దీనికి ముందుకు రావాలని పరిశోధకులు తెలిపారు.

ఆల్కహాల్‌ తక్కువ పరిమాణంలో తీసుకునే వారిలో కూడా కేన్సర్‌ వచ్చిన కేసులు ఉన్నాయి.మద్యం సేవించే అలవాటు ఉన్న వారు దీనిపై కాస్త జాగ్రత్త వహించాలని నిపుణులు తెలిపారు.

అంతేకాదు ఇటువంటి వారిలో హానికర రసాయనాలు శరీరంలో ఉత్పత్తి శాతం పెరిగి డీఎన్‌ఏ డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

Telugu Thousand Casses, Alchohal, Alcohol, Asia, Breast Cancer, Corona, India Al

దాంతో కేన్సర్‌ కణాలు వృద్ధి చెందుతాయి.ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకునే కేన్సర్‌ బాధితులు ప్రపంచవ్యాప్తంగా 4 శాతం మంది ఉన్నారని పరిశోధకులు తెలిపారు.మంగోలియాలో కేన్సర్‌ బాధితులు 10 శాతంగా ప్రథమ స్థానంలో ఉండగా, కుౖÐð ట్‌ జీరో శాతంలో ఉంది.

భారత్‌లో 5 శాతం ఆల్కహాల్‌ కేన్సర్‌ బాధితులు ఉన్నారు.చైనాలో 6 శాతం, జర్మనీ 4 శాతం, ఫ్రాన్స్‌ 5 శాతం ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube