భర్త ఇచ్చిన ప్రియమైన జుంకాలు ధరించిన ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్లో సోషల్ మీడియాలో ఎప్పుడూ కాస్త సరదా జోడించి పోస్ట్ లు పెట్టడంలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ఎప్పుడు ముందు ఉంటారు.

సమకాలీన రాజకీయాల మీద కూడా వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ తమ సెన్సాఫ్ హ్యూమర్ చూపిస్తూ ఉంటారు.

కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నా కి ఉల్లిపాయల జుంకాలు గివ్ట్ గా ఇచ్చాడు.తన భార్యకి తాను ఇచ్చే అత్యంత ఖరీదైన బహుమతి ఇదే అని సరదాగా కామెంట్స్ పోస్ట్ చేశాడు.

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈ విధంగా తనదైన శైలిలో స్పందించారు.అయితే ఉల్లి ధరలలో ఇప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేకపోగా మరింతగా పెరుగుతూ వస్తున్నాయి.

కొన్ని చోట్ల వీటి ధరలు 200 నుంచి 250 వరకు ఉన్నాయనే మాట వినిపిస్తుంది.ఇక ఏపీలో కూడా 150 రూపాయిలకి బయట మార్కెట్ లో అమ్ముతున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తన భర్త తనకి ఇచ్చిన ప్రియమైన జుంకాలు ధరించి ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసి కాస్తా ఫన్నీగా పోస్ట్ చేసింది.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవడంతో పాటు ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు