ఈమద్య కాలంలో ఓటీటీలో విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు కూడా నిరాశ పర్చుతున్నాయి.సౌత్‌లోనే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అనుకుంటే ఉత్తరాదిన కూడా పెద్దగా సక్సెస్ అయిన సినిమాలు ఏమీ లేవు.
సుశాంత్ రాజ్ పూత్ చివరి సినిమా అయిన దిల్ బేచార కాస్త సక్సెస్ ను దక్కించుకుంది.అంతకు మించి ఏ ఒక్క ఓటీటీ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు.
భారీ ఎత్తున అంచనాల నడుమ తెరకెక్కి విడుదల అయిన ఓటీటీ సినిమాలు అన్ని కూడా నిరాశ మిగిల్చాయి.థియేటర్లు ప్రారంభంకు ఇంకా చాలా సమయం పడుతుందనే ఉద్దేశ్యంతో సినిమాలను ఓటీటీ విడుదలకు సిద్దం చేస్తున్నారు.
ఈ సమయంలో బాలీవుడ్ నుండి వచ్చిన మూవీ ‘లక్ష్మి’.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా కాంచనకు రీమేక్ అనే విషయం తెల్సిందే.
తెలుగు మరియు తమిళంలో సెన్సేషనల్ సక్సెస్ దక్కించుకున్న ఆ సినిమా హిందీలో మాత్రం ప్లాప్ అయ్యింది.థియేటర్ల ద్వారా విడుదల అయితే ఖచ్చితంగా వంద కోట్ల ప్రాఫిట్ వచ్చేది అనేది కొందరి మాట.ఓటీటీలో ఇలాంటి హర్రర్ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు.అదే థియేటర్‌లో అయితే ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కోసం అయినా చూస్తారు అనడంలో సందేహం లేదు.

ఓటీటీలో సూపర్ స్టార్ మూవీ అయినా నిరాశ పర్చక తప్పదు అంటూ ఈ సినిమాతో నిరూపితం అయ్యింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉన్నా కూడా ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్థం అవ్వడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రివ్యూవర్స్ సైం ఈ సినిమా నిరాశ పర్చడం జరిగింది అంటూ రాశారు.మొత్తానికి ఓటీటీ విడుదల అంత శ్రేయస్కరం కాదు అంటూ ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యింది.
అందుకే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను విడుదల వాయిదా వేస్తున్నారు.