వీరికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వస్తున్నాయి?

నిర్బయ దోషులకు ఉరి శిక్ష పడి చాలా ఏళ్లు అయ్యింది.కాని ఇప్పటి వరకు ఆ శిక్ష అమలు కావడం లేదు.

ఈ కేసులో నలుగురికి ఒకేసారి ఉరి శిక్ష పడాల్సి ఉంది.ఒకరి తర్వాత ఒకరికి ఉరి వేసేందుకు వీలు లేదు.

కనుక ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా వీరు ఏదో ఒక పిటీషన్‌ వేస్తూ ఉరి శిక్షను తప్పించుకుంటున్నారు.నేడు ఉదయం వీరికి ఉరి పడాల్సి ఉంది.

కాని నిన్న కోర్టు వీరి ఉరికి స్టే విధించింది.నేడు వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి కొట్టివేసిన వెంటనే వీరికి మళ్లీ ఉరి ఖాయం అనుకున్నారు.

Advertisement

రేపో మాపో ఉరి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ అక్షయ్‌ కుమార్‌ పిటీషన్‌ వేశాడు.వీరి పిటీషన్స్‌ కోర్టు పరిధిలో ఉన్న సమయంలో వీరిలో ఏ ఒక్కరిని కూడా ఉరి తీసేందుకు వీలు లేదు.

అందుకే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పిటీషన్స్‌ వేస్తూనే ఉన్నారు.నలుగురు కూడా మామూలుగా చదువుకున్న వారే.

అయినా కూడా వీరికి ఇన్ని తెలివి తేటలు ఎక్కడ నుండి వస్తున్నాయంటూ న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటీ అంటే వీరికి కొందరు న్యాయవాదులు తమ పబ్లిసిటీ కోసం మద్దతు తెలుపుతున్నారు.

వారి సలహాల మేరకు వీరు ఉరిని తప్పించుకుంటూ ఉన్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు