సామాన్యులలోనే కాదు సినిమా సెలబ్రెటీలలో కూడా చిరకాల స్నేహితులు ఉంటారు.హీరో మరో ఇతర హీరోతో ఫ్రెండ్‌షిప్ చేయవచ్చు.
హీరో దర్శకుడితో, నిర్మాత హీరోతో ఇలా ఇండస్ట్రీలో ఎవరి మధ్య అయినా మంచి స్నేహం ఏర్పడవచ్చు.అయితే అప్పటి కాలంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు,( Akkineni Nageswara Rao ) అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత, ప్రొడ్యూసర్ దుక్కిపాటి మధుసూదనరావుల( Dukkipati Madhusudhana Rao ) మధ్య మంచి స్నేహం చిగురించింది.
అన్నపూర్ణ పిక్చర్స్ అంటే ఏఎన్నార్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అని చాలామంది అనుకుంటారు.ఈ హీరో భార్య పేరు అన్నపూర్ణ కాబట్టి అలా భావిస్తారు కానీ అది నిజం కాదు.
నిజానికి అది దుక్కిపాటి మధుసూదనరావు అమ్మగారి పేరు.వాస్తవానికి మధుసూదనరావు కన్న తల్లి పేరు గంగాజలం.దురదృష్టవశాత్తు ఆమె మరణించింది, దాంతో సవతి తల్లి అన్నపూర్ణ కన్నతల్లితో సమానంగా మధుసూదనరావు పోషించింది.అందుకే ఆమె పేరిట “అన్నపూర్ణ పిక్చర్స్”( Annapurna Pictures ) నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
ఆ సంస్థకు అక్కినేనిని ఛైర్మన్‌గా నియమించి పార్ట్‌నర్‌షిప్ కూడా అందించాడు.
పెయ్యేరు వాసి అయిన మధుసూదనరావు మచిలీపట్నంలోని నోబుల్ కాలేజ్‌లో డిగ్రీ చేశారు.అదే సమయంలో ఎక్సెల్షియర్ అనే డ్రామా కంపెనీ ప్రారంభించారు.అందులో ఆత్రేయ, బుధ్ధరాజు, అక్కినేని అందులో సభ్యులుగా వ్యవహరించేవారు.ఆ సమయానికి ఏఎన్నార్ ఆల్రెడీ వెండితెరపై అడుగు పెట్టాడు.1941లో ‘ధర్మపత్ని’ ఒక స్మాల్ రోల్ చేశాడు.మళ్లీ తిరిగి వెనక్కి వచ్చి నాటకాల్లో స్త్రీ పాత్రలు వేయడం ప్రారంభించాడు.
డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య రూపొందించిన ‘సీతారామ జననం’తో( Seeta Rama Jananam ) అక్కినేనికి మంచి క్రేజ్ వచ్చింది.అయితే ఏఎన్నార్ పెద్ద హీరో అవుతాడని దుక్కిపాటి కెరీర్ తొలినాళ్లలోనే అంచనా వేశారు.ఆ కారణం చేత అతడితో కలిసి చాలా సినిమాలు చేశారు.
నిజానికి తన సొంత బ్యానర్ అన్నపూర్ణ పిక్చర్స్‌లో నిర్మించిన అన్ని సినిమాలు అక్కినేనివే అయ్యాయి.దాన్నిబట్టి వారి మధ్య ఎంత మంచి ఫ్రెండ్‌షిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
దుక్కిపాటి మధుసూదనరావు మంచి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు కథా రచయిత కూడా.స్క్రీన్‌ప్లే కూడా బాగా రాయగలడు.దుక్కిపాటి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ కింద ‘దొంగరాముడు’, తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి వంటి సూపర్ హిట్ సినిమాలను తీశారు నిర్మించారు.