టాలీవుడ్ కింగ్ నాగార్జున ( Nagarjuna )బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు చవి చూస్తూ వస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ( Soggade Chinni Nayana Movie )తర్వాత ఇప్పటి వరకు మంచి కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకోలేదు.
మధ్య లో బంగార్రాజు సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది.కానీ ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ మరియు ఇతర సినిమా లు బొక్క బోర్లా పడ్డాయి.
దాంతో నాగార్జున కెరీర్ విషయం లో సందిగ్ధం నెలకొంది.చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున ఎట్టకేలకు కొన్ని వారాల క్రితం నా సామి రంగ సినిమా ను మొదలు పెట్టాడు.
సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యం తో నాగార్జున సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ముగించే పనిలో ఉన్నాడు.ఒక వైపు వారం లో ఒక రోజు బిగ్ బాస్ షో లో నాగార్జున పాల్గొంటున్నాడు.అయినా కూడా నా సామి రంగ సినిమా( Naa Saami Ranga ) షూటింగ్ దాదాపుగా 50 శాతం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ రేంజ్ లో షూటింగ్ ను స్పీడ్ గా పూర్తి చేస్తున్న హీరో కేవలం నాగార్జున మాత్రమే అంటూ కొందరు అక్కినేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
మొన్న మొన్నే షూటింగ్ ప్రారంభించినట్లుగా అనిపించింది.ఇంతలోనే సినిమా యొక్క షూటింగ్ సగం పూర్తి అయిందని యూనిట్ సభ్యులు చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.సినిమా షూటింగ్ ను నంబర్ లోనే ముగించే అవకాశాలు ఉన్నాయి.
డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక జనవరి మొదటి వారం నుంచే సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు చేసి సినిమా ని వచ్చే సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా లో నాగార్జున ఓ విభిన్నమైన మాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు.
కచ్చితంగా నాగ్ కి( Nagarjuna ) చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్ దక్కబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.