తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3కి అంతా సిద్దం అయ్యింది.రెండు ప్రోమోలు ఇప్పటికే వచ్చేశాయి.
ఇక మూడవ ప్రోమో హోస్ట్ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇవ్వబోతుంది.తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్ చేయబోతున్నాడు.
ఆ తర్వాత మూడవ సీజన్‌కు కూడా మరో హోస్ట్‌తో చర్చలు జరిపారు.మూడవ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జున దాదాపుగా ఫైనల్ అయినట్లే అని ప్రచారం జరుగుతోంది.
మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాగార్జున బిగ్‌బాస్‌కు హోస్ట్ అనగానే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో ఒకానొక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బిగ్‌బాస్ అనేది తనకు ఇష్టం లేదని, అలాంటి షో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్చను హరించడం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.కొందరు వ్యక్తులను ఒక రూంలో ఉంచి వారి గురించి తెలుసుకోవడం అనేది నాకు నచ్చే పద్దతి కాదన్నాడు.

అసలు బిగ్‌బాస్ కాన్సెప్ట్ నాకు నచ్చదు అంటూ తేల్చి పారేశాడు.ఇప్పుడు అలాంటి బిగ్‌బాస్‌కు నాగార్జున ఎలా హోస్ట్ గా వ్యవహరిస్తాడు అంటూ ట్రోల్స్ వ్యక్తం అవుతున్నాయి.నాగార్జున షో ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.వాటన్నింటికి నాగార్జున సిద్దంగా ఉన్నాడా లేడా చూడాలి.గతంలో నాని పలు విమర్శలను ఎదుర్కొన్నాడు.ఇలాంటి సమయంలో నాగార్జున డేరింగ్ గా హోస్టింగ్‌కు సిద్దం అయ్యాడు.
మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.