అక్కినేని ఫ్యామిలీ( Akkineni family ) బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్( Sushanth ) కెరీర్ తొలినాళ్లలో హీరోగా పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.పెద్ద హీరోల సినిమాలలో ప్రాధాన్యత లేని పాత్రల్లో సుశాంత్ నటించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అక్కినేని నాగసుశీల( Akkineni Nagasusheela ) కొడుకు అయిన సుశాంత్ 2008 సంవత్సరంలో కాళిదాసు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కినా అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేదు.
చి ల సౌ సినిమాతో సక్సెస్ సాధించినా ఆ సినిమా మరీ బ్లాక్ బస్టర్ కాదు.అల వైకుంఠపురములో సినిమాలో మంచి రోల్ దక్కినా ఆ పాత్ర వల్ల సుశాంత్ కెరీర్ కు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.
చైతన్య, అఖిల్( Chaitanya, Akhil ) స్థాయిలో మార్కెట్ ను సొంతం చేసుకోవడంలో సుశాంత్ ఫెయిల్ అయ్యారు.

నాగార్జున( Nagarjuna ) సుశాంత్ కెరీర్ పై కెరీర్ తొలినాళ్లలో ఫోకస్ పెట్టినా ఆ తర్వాత తన కొడుకులపై దృష్టి పెట్టి సుశాంత్ విషయంలో నిర్లక్ష్యంలో వ్యవహరించడం జరిగింది.క్రేజ్ ఉన్న డైరెక్టర్లు ఎవరూ సుశాంత్ సినిమాలకు దర్శకత్వం వహించకపోవడం ఈ హీరోకు మైనస్ అయింది.నాగార్జున స్పెషల్ ఫోకస్ పెట్టి ఉంటే సుశాంత్ కెరీర్ మరో విధంగా ఉండేది.
ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా సుశాంత్ మాత్రం కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సుశాంత్ అక్కినేని హీరోల సినిమాలలో కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ అవుతోంది.
సుశాంత్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రావణాసుర సినిమాతో సుశాంత్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీ చేరిందనే సంగతి తెలిసిందే.







