బ్యాన్.. బాలకృష్ణ విషయంలో అక్కినేని వారు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా!

నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క సక్సెస్ మీట్ లో రంగారావు మరియు అక్కినేని ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యం లో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలింది అంటూ ప్రచారం జరుగుతుంది.

 Akkineni Family Ban On Balakrishna In Annapurna Studios , Akkineni Family , Anna-TeluguStop.com

అక్కినేని వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో భారీగా ఈ విషయమై పోట్లాడుకుంటున్నారు.ఇప్పటికే అక్కినేని హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్ తమ తాత గారి విషయం లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మరో వైపు అక్కినేని మరింత కఠినంగా బాలకృష్ణ విషయం లో వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.అదే కనుక జరిగితే అక్కినేని వారికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో కి బాలకృష్ణ ను అడుగు పెట్టనివ్వక పోవచ్చు.

బాలకృష్ణ కు సంబంధించిన సినిమాల్లో ఎక్కువ శాతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది.

Telugu Akhil, Akkineni, Balakrishna, Naga Chaitanya, Sv Ranga Rao, Veera Simha-M

ప్రస్తుతం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి కూడా సెట్ అన్నపూర్ణ స్టూడియో లోనే వేయడం జరిగింది.అక్కినేని వారు కాస్త సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంటే బాలకృష్ణ ను అన్నపూర్ణ స్టూడియోస్ గేటు కూడా దాటనిచ్చే అవకాశాలు లేవు, కానీ అక్కినేని వారు అలా చేస్తారా అంటే కచ్చితంగా చేయరు అనే అభిప్రాయాన్ని చాలా మంది సినీ ప్రముఖులు మరియు మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Akhil, Akkineni, Balakrishna, Naga Chaitanya, Sv Ranga Rao, Veera Simha-M

బాలకృష్ణ ను అన్నపూర్ణ స్టూడియోస్ కు రాకుండా బ్యాన్ చేస్తే అది వారికి పెద్ద చెడ్డ పేరు అవుతుంది.ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఉన్న మంచి పేరు ను స్వయంగా అక్కినేని వారు చెడగొట్టిన వారు అవుతారు, వివాదాలు గొడవలకు సంబంధం లేకుండా అక్కినేని వారి ఫిల్మ్‌ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ మంచి పేరు సొంతం చేసుకొని వేలాది సినిమా లకు అడ్డాగా నిలిచింది.అద్భుతమైన సెట్స్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ ని ఈ వివాదంలోకి లాగడం అస్సలు మంచిది కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube