అక్కినేని అఖిల్ ( Akkineni Akhil ) ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.నాగర్జున వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతున్నాయి.
ఎంతో పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోకపోవడం నాగార్జున ( Nagarjuna ) కి కాస్త అవమానంగానే ఉంది.ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన చాలామంది ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే తన కొడుకుకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో రాణించడం లేదు అని కాస్త డిప్రెషన్ లో ఉన్నట్టు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి.

అయితే అక్కినేని అఖిల్ ఈ మధ్యకాలంలో ఏజెంట్ సినిమా ( Agent )తో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందు వచ్చి డిజాస్టర్ సినిమాని మూటగట్టుకున్నారు.ఇక అక్కినేని అఖిల్ సినిమాల విషయం కాస్త పక్కన పెడితే అఖిల్ కూడా ఆ విషయంలో హీరోయిన్లను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.అదేంటంటే చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాలు రావడం కోసం మరింత అందంగా తమ ఫేస్,బాడీ కనిపించడం కోసం ఎన్నో రకాల సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.
అయితే హీరోయిన్ల బాటలోనే అక్కినేని అఖిల్ కూడా అందం కోసం ఆ పార్ట్ కి సర్జరీ( Surgery ) చేయించుకుంటున్నారని తెలుస్తోంది.అక్కినేని అఖిల్ ఫేస్ కలర్ బాగానే ఉన్నప్పటికీ ఆయన మొహం లో ఉన్న ముక్కు బాగుండదట.
అయితే ఈ ముక్కు కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆయన తన ఫేసులో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ బయటపెట్టిన కూడా ప్రేక్షకులకి అవి సరిగ్గా కనిపించడం లేదు.

అందుకే విదేశాలకు వెళ్లి తన ముక్కుకు సర్జరీ( Nose Surgery ) చేయించుకోవాలని డిసైడ్ అయ్యారట అక్కిరని అఖిల్.మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ నుండి మాత్రం అక్కినేని అఖిల్ ముక్కుకు సర్జరీ చేయించుకోబోతున్నారు అనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది.మరి సర్జరీతో నైనా అఖిల్ కి అవకాశాలు కలిసి వస్తాయో చూడాలి.







