చాలామంది సెలబ్రిటీల పెళ్లి జరుగుతుంది అంటే వారికి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఎంగేజ్మెంట్ రింగ్ నుండి వారు కట్టుకునే పెళ్లి బట్టల వరకు వారు వేసుకుని డైమండ్ నెక్లెస్,కాళ్లకు ధరించే షూలు, చేతిలో పట్టుకునే హ్యాండ్ బ్యాగ్ లు ఇలా ప్రతి ఒక్కటి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది.
అలాగే వీరు ఎంతో కాస్ట్లీ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే సెలబ్రిటీల పెళ్లి అనగానే గుర్తుకు వచ్చే మరొకటి కట్నం.

ఇప్పటికే చాలామంది నటినటులు పెళ్లి చేసుకున్న సమయంలో వారికి వచ్చే భార్యలు ఎంత కట్నం తెచ్చారు అనే వార్తలు మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మెగా ఫ్యామిలీకి కోడలుగా రాబోయే లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) మెగా ఇంటికి ఎన్ని కోట్ల కట్నం తీసుకురాబోతుంది అనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి లావణ్య త్రిపాఠి ఎన్ని కోట్ల కట్నం తీసుకువస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా ఫ్యామిలీ (Mega family) కి తమ కూతురు పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులు, అలాగే తమ కూతురు సంపాదించిన సంపాదన, ఆమె కోసం చేయించిన బంగారం అలాగే తమ ఆస్తిలో కూతురికి రావాల్సిన సగభాగం ఇలా అన్ని లావణ్య త్రిపాటి పేరు మీద కట్నం గా ఇచ్చేస్తామని లావణ్య త్రిపాఠి పేరెంట్స్ మెగా ఫ్యామిలీకి చెప్పారట.
కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కట్నం అవసరమే లేదు అని బెట్టు చేశారట.మాకు కట్నం అవసరం లేదు అని మెగా ఫ్యామిలీ చెప్పినప్పటికీ లావణ్య త్రిపాఠి పేరెంట్స్ మాత్రం అది మొత్తం మా కూతురు మీదే ఉంటాయి.

మేము ఇచ్చే ఈ చిన్న కానుకను కూడా కాదనకండి అంటూ మెగా ఫ్యామిలీని బ్రతిమిలాడుకుందట.ఇక కూతురి ఆనందం కోసం తమ తల్లిదండ్రులు ఇచ్చే ఆ కట్నాలు కాదని వారిని ఎందుకు బాధ పెట్టాలి అని మెగా ఫ్యామిలీ కూడా మీ ఇష్టం మాకు మాత్రం కట్నం వద్దు కానీ నీ కూతురు పేరు మీదే ఏదైనా చేయించుకోండి అని చెప్పారట.ఇక లావణ్య త్రిపాటి (Lavanya tripathi) సినిమాల్లోకి వచ్చి సంపాదించిన ఆస్తులతో పాటు పేరెంట్స్ సంపాదించిన ఆస్తిలో ఆమెకు రావాల్సిన సగభాగాన్ని కూడా లావణ్య త్రిపాటికి రాసిచ్చారట లావణ్య త్రిపాఠి పేరెంట్స్.







