పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివా పాల్గొంటున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు పవన్.వచ్చే ఏడాది లోపు తాను కమిట్ అయిన సినిమాలను ఎలా అయినా పూర్తి చేయాలని భావిస్తున్నారు పవన్.
ఇందుకోసం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అయితే ఇప్పటివరకు అఫీషియల్ కాకపోయినప్పటికీ ఆ వార్త మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.అదేమిటంటే.అకీరా నందన్( Akira Nandan ) సినీ ఎంట్రీ ఫిక్స్.అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాతోనే అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఈ కిక్కును మించి ఇంకేముంటుంది.
ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా( OG ) చూపించబోతున్నారు సుజీత్.ఈ వార్త పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిస్తే తాజాగా ఇందులో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఒక కీ రోల్ చేయబోతున్నాడు అన్నది అభిమానులకు మరింత కిక్కిస్తోంది.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అకీరా నందన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ టీనేజర్, కాలేజ్ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్‌గా మూడు వేరియేషన్స్‌లో కనిపించనున్నారని, అయితే పవన్ టీనేజ్ రోల్ కోసం అకీరా నందన్‌ని తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేశారట.17 ఏళ్ల టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్‌ను పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్‌తో చేయించాలని స్కెచ్ వేశారు సుజీత్.ఈ వార్త కనుక నిజమైతే పవన్ అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.







