భయభ్రాంతులకు గురిచేసి తప్పించుకోవడానికె అఖిల్ ఆత్మహత్య ప్రయత్నం : చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం (Chendurthi )తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోట అఖిల్( Akhil ) అనే యువకుడు భయభ్రాంతులను సృష్టించడానికే బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.అఖిల్ అనే వ్యక్తి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 31 2024 సంవత్సరం రోజున గంజాయితో పట్టుబడగా అఖిల్ ని విచారించగా అమీర్, కాల్వ వెంకటేష్, పండుగ అభి, రవి ల వద్ద నుండి గంజాయి కొనుగోలు చేశామని తెలిపాడు.

ఆ నలుగురిని విచారించగా వారందరికీ తోట అఖిల్ r/o (తిమ్మాపూర్ గ్రామం చందుర్తి మండలం) గంజాయి ని సప్లై చేసేవాడని తెలిసింది, దీంతో అఖిల్ ను చందుర్తి పోలీస్ స్టేషన్ కు పిలిపించగా తదుపరి వేములవాడ రూరల్ పోలీసు వారికి అప్పగించిన అనంతరం వారు తీసుకుపోయే క్రమంలో అప్పటికి తన అన్న రాకేష్ ద్వారా ఒక పథకం ప్రకారం భయభ్రాంతులు గురిచేయాలనే దురాలోచనతో బ్లేడు తెప్పించుకొని తన శరీరంపైన గాయాలు ఏర్పరచుకునే క్రమంలో సిబ్బంది వెంటనే ఆపి అతనిని చికిత్స జరిపించారు.అనంతరం అఖిల్ ను వేములవాడ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్టు చేసి కోర్టు నందు ప్రవేశపెట్టారు.

ఈ సంఘటనలో కేవలం అరెస్టును తప్పించుకోవడానికి ఆడిన నాటకం అన్నారు.చట్ట ప్రకారం చేయవలసిన విధులలో పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని,అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అఖిల్ గంజాయి కి,మద్యానికి బానిసై జల్సాలకు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

Latest Rajanna Sircilla News