బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.మొదటి నుంచి కూడా ఎంతో చాకచక్యంగా టాస్కులను ఫినిష్ చేస్తూ ఉన్నటువంటి ఈయనని హౌస్ లో కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ వచ్చారు అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సై అంటే సై అంటూ పోటీకి దిగుతున్నారు.
ఇక ఇప్పటివరకు మూడు వారాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నుంచి ముగ్గురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.ఇక నాలుగవ వారంలో భాగంగా పవర్ అస్త్రా( Power Astra ) కోసం కంటెస్టెంట్లు అందరూ పెద్ద ఎత్తున పోటీపడ్డారు.
ఇప్పటివరకు హౌస్ లో ఆట సందీప్ శివాజీ శోభా శెట్టి ఈ ముగ్గురికి మాత్రమే పవర్ అస్త్రా ఉంది.

ఇక నాలుగవ వారంలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య జరిగినటువంటి టాస్కులలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంతో చాకచక్యంగా అన్ని టాస్కులలోను గెలుపొందుతూ చివరికి పవర్ అస్త్రా సొంతం చేసుకున్నారు.ఇలా కామన్ మ్యాన్ గా వచ్చి సెలబ్రిటీలు అందరిని దాటుకుంటూ ఈయన పవర్ అస్త్రా సొంతం చేసుకోవడంతో రెండు వారాలపాటు ఇమ్యూనిటీ ఈయనకు ఉంటుంది.రెండు వారాలపాటు ఎవరూ కూడా తనని నామినేట్ చేయడానికి వీలు లేదు.
అయితే పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్రా గెల్చుకోవడంతో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ (Akil Sarthak) సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అఖిల్ సార్థక్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎంత టార్గెట్ చేసినా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌజ్‌మేట్ అయ్యాడు.నాకు చాలా సంతోషంగా ఉంది.
తనను కింద లాగాలని చూసిన వారికి తన ఆటతీరుతో గూబ గుయ్‌మనేలా పల్లవి ప్రశాంత్ వారికి సమాధానం చెప్పాడు. జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ సందర్భంగా ఆయనని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా అఖిల్ సార్థక్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది .అయితే కథ వారంలో భాగంగా ఈయనని కొంతమంది టార్గెట్ చేసినప్పుడు అఖిల్ సార్థక పల్లవి ప్రశాంత్ కే మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా ఈయనపై ప్రశంసలు కురిపించడంతో పల్లవి ప్రశాంత్ కి కూడా మద్దతు పెరుగుతుంది.