అఖిల్ సినిమా కి అన్ని కోట్ల బడ్జెట్ అవసరమా..?

అక్కినేని ఫ్యామిలీ( Akkineni family ) నుంచి వచ్చిన మూడో తరం హీరోలలో నాగ చైతన్య, అఖిల్( Naga Chaitanya, Akhil ) ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే వరుసగా ఒకటి రెండు హిట్లు కొట్టిన నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరో గా మారిపోయాడు.

ఇక అఖిల్ కి మాత్రం సరైన హిట్టు ఒక్కటి కూడా పడట్లేదు.ఇప్పటికే తను చేసిన ఆరు, ఏడు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఏం సినిమా చేయాలనే దాని మీదనే ఆయన చాలావరకు ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఎందుకంటే ఎన్నో అంచనాలను పెట్టుకొని వచ్చిన ఏజెంట్ సినిమా( Agent movie ) భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఇక దాంతో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక ఇప్పటివరకు అయితే ఆయన కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని ఒక టాక్ అయితే వస్తుంది.

దానికి 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.ఒక్క హిట్టు కూడా లేకుండా వంద కోట్ల బడ్జెట్ పెట్టించడం కరెక్ట్ కాదు అంటూ అఖిల్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

అయితే కొత్త డైరెక్టర్ ఎవరు అనే దాని పైన ఆరాధిస్తే ఆయన రాజమౌళి( Rajamouli ) దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన వ్యక్తిగా తెలుస్తుంది.

ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయిన, ఎంత పెద్ద హీరో అయిన కూడా మార్కెట్ ఉన్నంతవరకు బడ్జెట్ పెడితే బాగుంటుంది కానీ ఎక్కువ పెడితే నష్టాలు వస్తాయి ఇక ఇప్పటికే ఏజెంట్ సినిమాతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర( Anil Sunkara ) కి చాలా నష్టాలు వచ్చాయి.ప్రస్తుతం అఖిల్ కి మార్కెట్ కూడా అంతలా లేదు కాబట్టి 100 కోట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు