తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులలో నాగార్జున ఒకరు.ఈయన దాదాపు 35 సంవత్సరాల మంచి మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.
కానీ ఈయన కొడుకు అయిన అఖిల్( Akhil Akkineni ) మాత్రం ఇండస్ట్రీ కింవచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఆయన ఐదు సినిమాలు చేసిన కూడా వాటిలో ఏది కూడా సక్సెస్ సాధించకపోవడం అక్కినేని అనే బ్రాండ్ ఇమేజ్ కి బాగా ఇబ్బందిని కలిగించే విషయమనే చెప్పాలి.
మరి ఇలాంటి క్రమంలో అఖిల్ కోసం నాగార్జున( Nagarjuna ) స్టార్ డైరెక్టర్స్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు అందరూ చాలా బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రావడం లేదు.మరి ఇలాంటి క్రమంలో అఖిల్ తో ఒక పాన్ ఇండియా డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఆయన ఎవరు అంటే చందు మొండేటి అని తెలుస్తుంది.ఇక ఇప్పటికే చండు మొండేటి నాగచైతన్యతో తండేల్( Thandel ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అఖిల్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి నాగార్జున చాలా వరకు ప్రయత్నం చేసి సఫలమైనట్టుగా తెలుస్తుంది.మరి చందు మొండేటి అయిన అఖిల్ కి అదిరిపోయే సక్సెస్ ని ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.ఇక తండేల్ సినిమాతో నాగచైతన్య ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టబోతున్నాడనే చిత్ర యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం చందు మొండేటి నాగచైతన్య ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన వారు అవుతారు.ఇక చందు మొండేటి మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది.