అఖిల్( Akhil ) అక్కినేని తాజాగా సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో ఏజెంట్ సినిమా ( Agent Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
అఖిల్ ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించగా ఈ నాలుగు సినిమాలు తనకు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి.ఈ క్రమంలోనే తన ఆశలన్నీ కూడా ఏజెంట్ సినిమా పైన పెట్టుకున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ ట్రైలర్ వీడియో యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టించింది ఏకంగా నందమూరి నరసింహ బాలయ్య( Balayya ) రికార్డులను కూడా చెరిపేసి ఏజెంట్ ట్రైలర్ రికార్డ్ సృష్టించింది.ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలలో యూట్యూబ్లో ఏకంగా 12 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది.
ఇక ఈ ట్రైలర్ బాలకృష్ణ( Balakrishna ) నటించిన వీర సింహారెడ్డి ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసిందని చెప్పాలి.

గోపీచంద్ మలినేని( Gopi Chand ) దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి ( Veera Simha Reddy )ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ అప్పట్లో 24 గంటల్లోనే పది మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది.అయితే ఇప్పుడు అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ట్రైలర్ మాత్రం బాలయ్య రికార్డును బ్రేక్ చేస్తూ 12 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో ఏజెంట్ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాపై అఖిల్ తో పాటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మరి అఖిల్ కి ఏజెంట్ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.







