న్యూయార్క్ లో అఖండ..స్పీకర్లు బద్ధలవుతున్నాయని నోటీస్ పెట్టారు..!

అఖండ సినిమాకు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

ఇక న్యూయార్క్ లో సినీమార్క్ థియేటర్ లో ప్రీమియర్స్ తర్వాత సౌండ్ డెసిబెల్స్ తగ్గిస్తున్నామని థియేటర్ లో నోటీస్ పెట్టారు.

ప్రీమియర్స్ టైం లో థమన్ ఇచ్చిన బిజిఎం కు స్పీకర్స్ బద్ధలయ్యాయట.అందుకే ప్రీమియర్స్ తర్వాత షో నుండి సౌండ్ తగ్గిస్తున్నామని నోటీస్ పెట్టారు.

అఖండ సినిమాకు థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ కొట్టాడు అన్నది ఇది ఒక ఎక్సాంపుల్ గా చెప్పుకోవచ్చు.నిజంగానే థమన్ అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అరుపులు పెట్టించాడు. బాలయ్య మాస్ యాక్షన్ కు దాన్ని ఇంకాస్త హైలెట్ అయ్యేలా థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.

Advertisement

సినిమాలో ప్రధాన హైలెట్ గా చెప్పుకునే వాటిలో థమన్ మ్యూజిక్ కూడా ఒకటి.నందమూరి ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబోతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

అఖండ సినిమాతో బాలయ్య బాబు స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ కూడా బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ గా వస్తాయని చెప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు