అఖండకు గుమ్మడికాయ కొట్టినట్లేగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో నటసింహం మరోసారి బాక్సాఫీస్‌పై తన పంజా విసరడం ఖాయమని వారు భావిస్తున్నారు.

 Akhanda Movie Wrapped Up, Akhanda, Balakrishna, Boyapati Sreenu, Shooting, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని వారు లెక్కలు వేస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడటంతో, ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతేడాదే ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరగడంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.తాజాగా ఈ సినిమా షూటింగ్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ముగిసినట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పేర్కొంది.

దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని వారు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఓ సాధారణ రైతు పాత్రతో పాట మునుపెన్నడూ చేయని అఘోరా పాత్రలో కూడా కనిపిస్తున్నాడు.ఇప్పటికే ఈ లుక్స్‌కు సంబంధించిన టీజర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube