బిగ్‌ఫైట్‌ : ఒకటి రెండు రోజుల గ్యాప్‌ లో 'ఆచార్య' - 'అఖండ'

తెలుగు లో సీనియర్ స్టార్‌ హీరోలు ఎవరు అంటే ఖచ్చితంగా వినిపించే పేర్లలో మొదటగా చిరంజీవి మరియు బాలకృష్ణల పేర్లు ఉంటాయి.

దాదాపుగా మూడు దశాబ్దాలుగా వీరి మద్య పోటీ కొనసాగుతూనే ఉంది.

పెద్ద ఎత్తున అంచనాలున్న వీరి సినిమాలు పోటీ పడ్డ ప్రతి సారి కూడా ఒకసారి బాలయ్య ఒకసారి చిరు కొన్ని సార్లు ఇద్దరు గెలుస్తూ వచ్చారు.ఈ దసరాకు కూడా వీరిద్దరు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదేంటి దసరాకు ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతుంది కదా అంటారా.ఇప్పటి వరకు దసరాకు ఆర్‌ ఆర్ ఆర్ సినిమా విడుదల అని అంతా అనుకుంటున్నారు.

కాని జక్కన్న ఇంకా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టలేదు.కనుక సినిమా విడుదల తేదీ విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Akhanda And Acharya Movie Release Dates,latest Tollywood News
Advertisement
Akhanda And Acharya Movie Release Dates,latest Tollywood News -బిగ్‌�

ఒక వేళ ఆర్ ఆర్ ఆర్ కనుక విడుదల ఆలస్యం అయితే ఆ తేదీకి ఆచార్య మరియు అఖండలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.ఈ రెండు సినిమా లు కూడా షూటింగ్‌ లు దాదాపుగా ముగిశాయి.కాని రెండు సినిమా ల యూనిట్‌ సభ్యులు కూడా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అంటున్నారు.

రెండు మూడు రోజుల షూట్స్ తో రెండు సినిమాలు కూడా ముగుస్తాయని అంతా అంటున్నారు.ఇక విడుదల తేదీల విషయంలో ఇప్పటి వరకు రెండు సినిమాలు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.

ఆర్ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్ ను ముగిస్తే ఆ తర్వాత విడుదల తేదీ విషయంలో స్పష్టత వస్తుంది.ఒక వేళ ఆర్‌ ఆర్‌ ఆర్‌ దసరా బరి నుండి తప్పకుంటే వెంటనే ఈ రెండు సనిమా ల విడుదల తేదీలను ప్రకటించేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు.

ఒకటి రెండు రోజుల తేడాతోనే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్‌ కు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు