కోలీవుడ్ ప్రముఖ నటుడు రిచర్డ్ రిషి ( Richard Rishi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
కాగా నటుడు రిచర్డ్ రిషి ఇది ఇలా ఉంటే కోలీవుడ్( Kollywood ) స్టార్ హీరో అజిత్ బావమరిది అన్న విషయం తెలిసిందే.రిషి ప్రేమలో పడ్డాడు.
దాదాపు 45 ఏళ్ల వయసులో ప్రేమ పాటలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్ యషికా ఆనంద్‌తో ( Yashika Anand ) సన్నిహితంగా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిచర్డ్.

ఆ సూర్యుడు మమ్మల్ని ముద్దాడుతున్నాడంటూ క్యాప్షన్ ను కూడా జోడించాడు.ఇందులో యషికా రిచర్డ్ చెంపకు ముద్దు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే యషికా అజిత్ కుటుంబంలో చేరనుందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే వీరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువే ఉంది.రిచర్డ్ వయసు 45 కాగా యషికా వయసు కేవలం 23 ఏళ్లే.
అంటే వారిద్దరి మధ్య దాదాపుగా 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

దీంతో మీరిద్దరూ తండ్రీకూళ్లులా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.అయినా అంత పెద్ద ఏజ్ ఉన్నటుడికి అంత చిన్న అమ్మాయితో లవ్ అవసరమా అంటూ కొందరు మండిపడుతున్నారు.అయితే నిజంగానా లేకపోతే ఏదైనా సినిమా కోసమా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.కాగా రిచర్డ్ రిషి ఒకప్పుడు విడుదల అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం తెలిసిందే.కాగా రిషి ఎందుకంటే ప్రేమంట చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.
అతడు చివరగా పరంపాదం విలయట్టు, రుద్ర తాండవం సినిమాలు చేశాడు.తెలుగులో చివరగా ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి చిత్రంలో కనిపించాడు.
