సినీ నటి లావణ్య త్రిపాటి ( Lavanya Tripati )మెగా ఇంటి కోడలు కాబోతుందన్న వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.హీరో వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ మాటలలో ఎంతవరకు నిజముందనే విషయం గురించి క్లారిటీ లేకపోయినా తాజాగా వీరిద్దరూ జూన్ 9వ తేదీ నిశ్చితార్థం(Engagement) జరుపుకోనున్నారు అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.
ఇలా వీరి నిచ్చితార్థం జరగబోతుందన్న విషయం తెలియడంతో వరుణ్ తేజ్ లావణ్య గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారని తెలియడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్న లావణ్య ఎంత మేరా కట్న కానుకలు తీసుకొస్తున్నారనే విషయం గురించి ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కు భారీగానే కట్న కానుకలు ఇచ్చారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ వద్దని చెప్పినప్పటికీ బలవంతంగా లావణ్య తల్లిదండ్రులు తమ తృప్తి కోసం ఈ కానుకలు తీసుకోవాలని చెప్పారట దాంతో చేసేదేమీ లేక వరుణ్ తేజ్ కట్న కానుకలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మరి లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ కు ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకొస్తున్నారు అనే విషయానికి వస్తే వరుణ్ కోసం ఖరీదైన కారుతో పాటు వీరిద్దరూ పెళ్లి తర్వాత ఉండడానికి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక బంగ్లాను కూడా కానుకగా ఇవ్వబోతున్నారట.వీటితో పాటు లావణ్య కు 5 కిలోల బంగారు ఆభరణాలు, అలాగే ఆరు కోట్ల మేర డబ్బులు కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.ఇలా లావణ్య త్రిపాఠి భారీగానే కట్న కానుకలు తీసుకువస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి వీటన్నింటికీ క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.







