బోలా టీజర్ పై భారీ ట్రోల్స్.. అఖండ సినిమానా? ఖైదీనా అంటూ?

Ajay Devgn Bholaa Teaser 2 Raises Doubt On Kaithi Movie, Ajay Devgn, Bholaa Movie, Bholaa Teaser 2, Kaidhi Movie, Akhanda Movie , Tabu, Bollywood

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో తెరకెక్కించిన సినిమాలు మరో భాషలో రీమేక్ చేయాలి అంతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒరిజినల్ లానే సినిమాను తెరకెక్కిస్తే కాఫీ అని అంటారు.

 Ajay Devgn Bholaa Teaser 2 Raises Doubt On Kaithi Movie, Ajay Devgn, Bholaa Mov-TeluguStop.com

సినిమాలో కొన్ని మార్పులు చేస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్సయింది అని అంటారు.ఇలా ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేస్తూ తప్పులు పడుతూ ఉంటారు.

అందుకే ఒక సినిమాను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే తాజాగా ఇలాంటి మాటలు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు కూడా ఎదురయ్యాయి.

Telugu Ajay Devgn, Akhanda, Bholaa, Bholaa Teaser, Bollywood, Kaidhi, Tabu-Movie

అజయ్ దేవగన్ నటిస్తున్న బోలా శంకర్ సినిమా విషయంలో ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయినా ఖైదీ సినిమాను హిందీలో బోలా అనే టైటిల్ తో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు.అయితే అజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ 1 తో డౌట్ కలిగించిన అజయ్ దేవగన్ టీజర్ 2 తో భోలా సినిమా ఖైదీ రీమేక్ అయ్యి ఉండదులే అనే నమ్మకాన్ని నిజం చేసే రెండో విజువల్స్ ని చూపించాడు.

అయితే తొందరగా విడుదలైన భోలా సినిమా టీజర్ 2 పై భారీగా నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

Telugu Ajay Devgn, Akhanda, Bholaa, Bholaa Teaser, Bollywood, Kaidhi, Tabu-Movie

తాజాగా విడుదల అయిన టీజర్ 2 లో అక్కడక్కడ చూపించిన కొన్ని షాట్స్ ని చూసి ఇది ఖైదీ సినిమా అనుకోవాలి.అలాగే మిగిలిన దేవుడు ఫాంటసీ లాంటి ఎలిమెంట్స్ చూస్తుంటే ఇది ఖైదీ సినిమా కాదు అఖండ సినిమా నేమో అన్న అనుమానం వస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా టీజర్ ఖైదీ రీమేక్ లా లేకపోతే అఖండా రీమేక్ నా అన్న అనుమానం వస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళ్ లో ఆఫీసర్ పాత్రని యాక్టర్ నరైన్ చేయగా హిందీలో ఈ పాత్రని టబూ ప్లే చేసింది.ఇక ఇక్కడి నుంచి మొదలైన మార్పు ఖైదీ సినిమా మొత్తం కంటిన్యూ అయినట్లు తెలుస్తోంది.

ఇంకొందరు అయితే మార్పులు చేస్తే చేశాడు కానీ హిట్టు కొడితే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి నెట్టజెన్స్ కామెంట్స్ పై స్పందించి ఈ సినిమాలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.ఈ సినిమా మార్చి 30వ తేదీన విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube