రిపబ్లిక్ డే కానుకగా 'ఏజెంట్' నుండి అప్డేట్.. ఏంటంటే?

అక్కినేని నాగార్జున వారసుడిగా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని.అయితే అఖిల్ హీరోగా వచ్చిన తర్వాత ఈయనకు సూపర్ హిట్ అనేది చాలా రోజుల వరకు రాలేదు.

 Akhil Akkineni's Agent Release Date Announce, Agent Release Date, Akhil Akkineni-TeluguStop.com

ఈయన గత సినిమా బ్యాచిలర్ తో మంచి హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ”ఏజెంట్” సినిమా చేసాడు.

ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలెట్టాడో తెలియదు కానీ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది.కరోనా కారణంగా ఈ సినిమా షూట్ చాలా రోజులు ఆగిపోయింది.దీంతో ఈ సినిమా షూట్ రెండుళ్లు అవుతున్న పూర్తి కాలేదు.ఇక ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూట్ జరుగుతుంది.

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంత వరకు అయితే బజ్ క్రియేట్ అవ్వలేదు.

Telugu Akhil, Akhil Akkineni, Akhilakkinenis, Anil Sunkara, Mammootty, Sakshi Va

ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.అలాగే హిప్ హప్ తమిళ్ సంగీతాన్ని అందిస్తుండగా రసూల్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

Telugu Akhil, Akhil Akkineni, Akhilakkinenis, Anil Sunkara, Mammootty, Sakshi Va

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఆగష్టు నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకుని మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.మరి తాజాగా అందుతున్న బజ్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు టాక్.

మరి ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ అయితే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube