స్టార్ హీరోని డైరెక్ట్ చేయనున్న అజయ్ భూపతి...

తెలుగులో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి వాళ్లలో అజయ్ భూపతి( Ajay Bhupathi ) ఒకరు.

ఈయన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో కల్ట్ క్లాసికల్ మూవీస్ ని తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత చేసిన మహాసముద్రం సినిమాతో పెద్దగా ఆకట్టుకున్నప్పటికీ మంగళవారం సినిమాతో మాత్రం తన మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేశాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకి డైరెక్టర్ గా మరొకసారి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.నిజానికి ఈ సినిమాతో అజయ్ భూపతి పేరు భారీ రేంజ్ లో వినిపించింది.

ఇక దాంతో ఇప్పుడు ఆయన ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.అయితే అజయ్ భూపతి మంగళవారం హిట్టుతో ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ కి కథ చెప్పే అవకాశం దొరికినట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పటికే ఆయనకి కథ వినిపించి ఓకే చేసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక రామ్( ram ) డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత అజయ్ భూపతి తో సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో కనక తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే తన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక డబుల్ ఇస్మార్ట్( Double ismart ) తో మొత్తం ఇండియా లెవెల్ లో ఒక భారీ సక్సెస్ ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో పూరి కూడా మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు