డైరెక్టర్ హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా కొత్త కొత్తగా. ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించాడు.
ఇక ఈ సినిమాలో అజయ్, వీర్తి వఘాని, సీనియర్ హీరో ఆనంద్, కాశీ విశ్వనాధ్, తులసి, కళ్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో సాయి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే ఇందులో ఆనంద్, కళ్యాణి నటరాజనుల కూతురు వీర్తి వఘాని.ఇక విశ్వనాధ్, తులసిల కొడుకు అజయ్.ఇందులో వీర్తి వఘాని పాత్ర పేరు రాజీ.అజయ్ పాత్ర పేరు సిద్దు. ఇక వీరిద్దరూ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటారు.
ఇక రాజీ అబ్బాయిలకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వదు.అలాంటిది సిద్దు ని చూడగానే ఇష్టపడుతుంది.
ఇక సిద్దు కూడా రాజీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు.ఇక రాజీ వాళ్ళ అన్న కేశవ్ తన చెల్లికి దూరం సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు.
ఇక కేశవ్ బామ్మర్ది అయినా రామ్ (పవన్ తేజ్) తన అక్కతో రాజీ అంటే ఇష్టమని తననే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెబుతాడు.అలా రామ్ తల్లిదండ్రులు రాజీ తల్లిదండ్రులతో మాట్లాడటంతో చివరికి సంబంధాన్ని ఓకే చేస్తారు.
కానీ రాజీ కి ఇంకా చదవాలని ఆశ ఉంటుంది.కానీ తన ఇంట్లో వాళ్ల కోసం వదులుకుంటుంది.
అలా తన తల్లితండ్రులు మాటలు కాదనలేక.తనను ప్రాణంగా ప్రేమించే ప్రియుడిని దూరం చేసుకోలేక తన మనసులో బాధను అలాగే పెట్టుకొని ఏం చేస్తుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
విజయ్ తొలిసారి పరిచయంతోనే తన పాత్రతో అనుభవం ఉన్న నటుడుగా అద్భుతంగా నటించాడు.ఇక హీరోయిన్ వీర్తి వఘాని కూడా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
ఇక ఈ సినిమాను డిఫరెంట్ గా చూపించాలని డైరెక్టర్ ప్రేక్షకులను బాగా సర్ప్రైజ్ చేశాడు.కొత్తదనంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచాడు.
శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది.కొరియోగ్రఫీ కూడా అందంగా చూపించారు.
మిగతా ఎడిటింగ్ పనులు కూడా బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినీ నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా నిర్మించారు.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదని చెప్పవచ్చు.ఈ సినిమాలో మంచి కాస్సెప్ట్ ని తీసుకొచ్చాడు డైరెక్టర్.ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త స్లోగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
మంచి కాన్సెప్ట్ తో ఫ్యామిలీ అందరూ చూసే విధంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.







