Aishwarya Rai: ఐశ్వర్య హెయిర్ స్టైల్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. అవి కవర్ చేసుకుంటోంది అంటూ?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్యరాయ్( Aishwarya Rai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఐశ్వర్యారాయ్.

 Aishwarya Was Also Trolled Due To Her Looks-TeluguStop.com

అంతేకాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇలా ఉంటే ఇటీవల ఐశ్వర్యారాయ్ మణిరత్నం ( Maniratnam ) దర్శకత్వంలో తెరకెక్కిన్ పొన్నియిన్ సెల్వన్( Ponniyin Selvan ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీ బిజీగా ఉన్నారు ఐశ్వర్య.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఐశ్వర్య కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఐశ్వర్య హెయిర్ స్టైల్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఐశ్వర్య ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా ఒకే హెయిర్ స్టైల్ లోనే కనిపిస్తోంది.కేవలం ఒకే హెయిర్ స్టైల్ ని ఎందుకు ఫాలో అవుతున్నారు.

దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.ఆ ఫోటోలపై నెగటివ్గా స్పందిస్తూ.ఇకపోతే ఐశ్వర్యారాయ్ ప్రతిసారి ఆమె ఒకే హెయిర్ స్టైల్ ఫాలో అవ్వడం వెనుక ఒక రహస్యం ఉంది.అదేమిటంటే ఐశ్వర్య తన బుగ్గలపై ఉన్న ముడతలను దాచడానికి ప్రయత్నిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.వీరికి ఒక పాప కూడా ఉంది.పాప పేరు ఆరాధ్య బచ్చన్. అయితే కేవలం ఐశ్వర్య హెయిర్ స్టైల్ మాత్రమే కాకుండా కూతురు ఆరాధ్య హెయిర్ స్టైల్ కూడా అచ్చం అలాగే ఉండడం పట్ల నెటిజన్స్ రహస్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube